Pawan Kalyan Vizag Land Scam.. విశాఖపట్నంలో భూ కబ్జా ఆరోపణలు ఈనాటివి కావు. ఎప్పటినుంచో వున్నవే.! కాకపోతే, ఏ ప్రభుత్వమూ ఆ భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపింది లేదు.!
కొన్నేళ్ళ క్రితం విశాఖ భూ కబ్జా వ్యవహారంపై ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’ ఏర్పాటయ్యింది. ఆ ‘సిట్’ నివేదిక ఏమైందో.? ఆ నివేదికపై ప్రభుత్వ చర్యలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు.!
గడచిన కొన్నేళ్ళలో విశాఖలో రాజకీయ నాయకులు నడిపిన భూ దందా వ్యవహారంపై మరోమారు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
కలెక్టర్ల సమావేశంల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విశాఖలో భూ కబ్జాల అంశాన్ని ప్రస్తావించారు. రాజకీయ ఒత్తిళ్ళతో, అధికారులు చర్యలు తీసుకోలేని పరిస్థితి వచ్చిందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
Pawan Kalyan Vizag Land Scam.. సీఎం చంద్రబాబు సమక్షంలోనే..
ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దాంతో, సీఎం చంద్రబాబు, అధికారులకు ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు ప్రకటించారు.
నిజానికి, విశాఖలో భూ కబ్జాపై ఉక్కు పాదం మోపడానికి ఇదే సరైన సమయం. ఐటీ రంగం అభివృద్ధి దిశగా విశాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టింది చంద్రబాబు సర్కార్.
ఈ నేపథ్యంలో, కబ్జా చెరలో వున్న ప్రభుత్వ అలాగే ప్రైవేటు భూములకు ప్రభుత్వం విముక్తి కలిగించగలిగితే, విశాఖకు ఎంతో మేలు చేసినట్లవుతుంది. విశాఖ అభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది.
మొహమాటాల్లేవ్..
సాధారణంగా ప్రభుత్వంలో వున్న వ్యక్తులు, కీలక పదవుల్లో వున్నవారు.. ఇలాంటి కబ్జా వ్యవహారాలపై పెదవి విప్పేందుకు ఇష్టపడరు.
కానీ, పవన్ కళ్యాణ్ వ్యవహారం వేరు.! డిప్యూటీ సీఎం హోదాలో వుండి కూడా, ముఖ్యమంత్రి సమక్షంలోనే కీలకమైన సమస్యపై నిర్మొహమాటంగా మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ ముక్కుసూటితనానికి తగ్గట్టుగానే, ప్రభుత్వం వైపు నుంచీ చర్యలుంటే, విశాఖ ప్రజలు కూటమి ప్రభుత్వానికి జీవితాంతం రుణపడిపోతారన్నది నిర్వివాదాంశం.
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధాని. రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన పెద్ద నగరం. అలాంటి విశాఖను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా వుంది.
