బాధ్యత – రాజకీయం: జగన్, చంద్రబాబు.. ఓ పవన్ కళ్యాణ్.!

 బాధ్యత – రాజకీయం: జగన్, చంద్రబాబు.. ఓ పవన్ కళ్యాణ్.!

Pawan Kalyan

Janasenani Pawan Kalyan Rajakeeyam.. శతృవుకి శతృవు మిత్రుడు.. చాలా కాలంగా వుంటూనే వున్నాం ఈ మాటని.! రాజకీయాల్లో ఈ తరహా ఈక్వేషన్ బాగా వర్కవుట్ అవుతుంది.!

2014 ఎన్నికల్లో బీజేపీ – టీడీపీ కూటమికి బయట నుంచి మద్దతిచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్. అప్పటికి జనసేన పార్టీ జస్ట్ ఆవిర్భవించిందంతే.!

కానీ, 2019 ఎన్నికలకొచ్చేసరికి జనసేన పార్టీ, అటు బీజేపీకీ ఇటు టీడీపీకీ సమదూరం పాటించింది. రాజకీయమంటేనే అంత.!

Janasenani Pawan Kalyan Rajakeeyam.. శాశ్వత శతృవులు.. శాశ్వత మిత్రులుండరు రాజకీయాల్లో..

అయితే, మళ్ళీ 2024 ఎన్నికలకొచ్చేసరికి టీడీపీ – జనసేన – బీజేపీ కలిశాయి.! రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఎవరూ వుండరనడానికి ఇదొక నిదర్శనం.

ఇక్కడ శతృవుకి శతృవు మిత్రుడు.. అనే ఈక్వేషన్‌ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘తూచా’ తప్పకుండా పాటించారన్నమాట. అలా జనసేనాని, చట్ట సభలకు వెళ్ళగలిగారు, డిప్యూటీ సీఎం కూడా అయ్యారు.

CBN Ys Jagan Andhra Pradesh Politics
CBN Ys Jagan Andhra Pradesh Politics

151 ఎమ్మెల్యేలున్న వైసీనీని 11 సీట్లకు పరిమితం చేసిన ఘనత ముమ్మాటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌దే.!

టీడీపీ 2024 ఎన్నికల్లో ఎక్కువ సీట్లలో పోటీ చేసి వుండొచ్చు జనసేన కంటే. కానీ, చక్రం తిప్పింది మాత్రం పవన్ కళ్యాణ్. టీడీపీ – బీజేపీ కలయికలో పవన్ కళ్యాణ్‌దే కీలక పాత్ర.

పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకుని వుండకపోతే..

ఒకవేళ పవన్ కళ్యాణ్ గనుక చొరవ తీసుకుని వుండకపోతే, బాధ్యతాయుతంగా వ్యవహరించి వుండకపోతే, టీడీపీ – జనసేన – బీజేపీ జత కట్టేవా.? వైసీపీని కూటమి మట్టికరిపించి వుండేదా.?

సో, 151 సీట్లతో విర్ర వీగిన వైసీపీని కేవలం 11 సీట్లకు పరిమితం చేసిన జనసేన పార్టీని తక్కువ అంచనా వేయకూడదు. పవన్ కళ్యాణ్ వ్యూహాల్ని అస్సలు లైట్ తీసుకోకూడదు.

Also Read: సనాతనంపై విషం: పాత్రికేయ వనంలో గంజాయి మొక్కలు.!

అధికార పీఠమెక్కాక జనసేన మీద తనదైన ‘పచ్చ’ రాజకీయాన్ని టీడీపీలో కొందరు ప్రయోగిస్తున్నారు. వాళ్ళకి అర్థమవ్వాల్సింది ఏంటంటే, తెగేదాకా లాగితే.. వైసీపీ అయినా, టీడీపీ అయినా ఒకటే.. జనసేనానికి.!

చంద్రబాబు అనుభవం రాష్ట్రాభివృద్ధికి అవసరం అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు కాబట్టి, టీడీపీకి ఆయన అంత గౌరవం ఇస్తున్నారు. దాన్ని నిలబెట్టుకోవాల్సింది టీడీపీనే.!

జనసైనికులకీ.. జనానికీ.. లేఖాస్త్రం.!

జనసేన కార్యకర్తల్ని వారిస్తూ పదే పదే జనసేనాని లేఖలు విడుదల చేస్తున్నారంటే, ఆ లేఖలు కేవలం జనసైనికులకే కాదు, రాష్ట్ర ప్రజానీకానికి కూడా.

తానెంత బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడినో పవన్ కళ్యాణ్ ఈ లేఖల ద్వారా జనానికి స్పష్టం చేస్తున్నారు. ఈ లేఖల విషయంలో టీడీపీ వెకలితనం ప్రదర్శిస్తే, అది అమాయకత్వమే అవుతుంది.

Pawan Kalyan Jana Sena Party
Pawan Kalyan Jana Sena Party

ఏతావాతా చెప్పేదేంటంటే, పవన్ కళ్యాణ్ రాజకీయం వేరు.! ఆయన రాజకీయం, ప్రజల కోసం.! మిగతా రాజకీయ నాయకులకంటే భిన్నం పవన్ కళ్యాణ్.!

చివరగా.. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్, 2024 ఎన్నికలకొచ్చేసరికి.. తన జనసేన పార్టీతోపాటు మరో రెండు పార్టీలని గెలిపించి, అధికార పీఠమ్మీద కూర్చున్నారు.!

సో, ముందు ముందు పవన్ కళ్యాణ్ రాజకీయం.. ఎలాంటి రాజకీయ సంచలనాలకు తెరలేపుతుందో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.!

Digiqole Ad

Related post