Rowdy Janardhana Vijay Deverakonda.. విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ‘రౌడీ జనార్ధన’.!
సినిమా టైటిల్‌ని రివీల్ చేస్తూ, చిత్ర బృందం ఓ వీడియో ప్రమోను విడుదల చేసింది. ఈ మధ్య హీరోలంతా, డార్క్ మోడ్‌లోకి వెళ్ళిపోతున్నారు.. రక్తపాతం సర్వసాధారణమైపోయింది.
ఎవరెంత రక్తపాతం సృష్టిస్తే, అంత మాస్.. అన్న మాట.! కానీ, అన్ని రక్తపాతాలూ వర్కవుట్ అయిపోవు కదా.? అయినా సరే, ట్రెండ్ ఫాలో అవుతూనే వున్నారు.
‘రౌడీ జనార్ధన’ ఇందుకు మినహాయింపేమీ కాదు. కాకపోతే, కొత్తగా ‘కళింగపట్నం’ బ్యాక్‌డ్రాప్ తీసుకున్నారన్నమాట. ఎక్కడుందీ కళింగపట్నం.?
Rowdy Janardhana Vijay Deverakonda.. ఇంటికో లం..కొడుకు..
శ్రీకాకుళం జిల్లాలో వుందీ కళింగపట్నం. సముద్ర తీర గ్రామం ఈ కళింగపట్నం. కళింగపట్నంలో ఇంటికొక లం..కొడుకు ‘రౌడీ’ అని చెప్పుకుంటాడట.
కానీ, ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న జనార్ధన కథ ఈ ‘రౌడీ జనార్ధన’ అట. హీరోతో, దర్శకుడు ఇదే డైలాగ్ చెప్పించాడు. డైలాగ్‌ని తనదైన ఇంటెన్సిటీతో చెప్పేశాడు హీరో విజయ్ దేవరకొండ.
అదేంటీ, సినిమా కథ ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగుతుంది కదా.? హీరో ఏంటి, ఇంకేదో యాసలో మాట్లాడతాడు.? అంటే, విజయ్ దేవరకొండ, తనకి ఏది వచ్చో అదే చేశాడంతే.
అయినా, ‘లం..కొడుకు’ అనే ‘బూతు’ ఎందుకు వాడాల్సి వచ్చినట్లు.? ‘ది ప్యారడైజ్’ సినిమా కోసం నాని కూడా, ఇలానే బూతు వాడేశాడు కదా.!
Also Read: ప్రియాంక చోప్రా.. టాలీవుడ్లో డబుల్ ధమాకా.!
ఈ మధ్య చాలా సినిమాల్లో, బూతు సర్వసాధారణమైపోయింది. అందునా, ‘లం..కొడుకు’ అనే డైలాగ్, ఫ్యాషన్ ట్రెండ్ అనుకుంటున్నట్లున్నారు సినీ జనాలు.
వెండితెరపై బీభత్సాన్ని ప్రేక్షకులు ఇష్టపడతారా.? బూతులు వాడితే, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల వైపు చూస్తారా.?
సినీ జనాలు ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోకపోతే, ముందు ముందు థియేటర్లనేవి కాలగర్భంలో కలిసిపోతాయన్నది నిర్వివాదాంశం.
చివరగా.. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్‌తో కెరీర్‌ని అయోమయంలో పడేసుకున్న విజయ్ దేవరకొండకి ‘రౌడీ జనార్ధన’ హిట్టిచ్చే కళ ఏమాత్రం కనిపించడంలేదు.
