Year Of Artificial Intelligence.. మీ టూత్ పేస్టులో ఉప్పు వుందా.? అంటూ ఓ కమర్షియల్ యాడ్ కొన్నాళ్ళ క్రితం భలే సందడి చేసేది.! ప్రముఖ సినీ నటులు, ఈ ప్రకటనల్లో నటించారు.
టూత్ పేస్టుకీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్కీ ముడిపెట్టడం సబబు కాదు గానీ.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించిన చర్చే జరుగుతోంది.
మీ కాలేజీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వుందా.? మీ కోచింగ్ సెంటర్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నేర్పిస్తారా.? అంటూ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి ‘వాకబు’ ఎక్కువైపోయింది.
అందుబాటులో వున్న మొబైల్ యాప్స్ అన్నీ దాదాపుగా ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ సాంకేతికని ఉపయోగిస్తున్నాయి.. వినియోగదారులకు, ఆ సాంకేతికని అందిస్తున్నాయి కూడా.
Year Of Artificial Intelligence.. అతి సర్వత్ర వర్జయేత్..
ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రోగ్రామింగ్ చాలా తేలిగ్గా చేసెయ్యొచ్చు.. యాప్స్ డెవలప్మెంట్ సులవైపోయింది.. వెబ్ సైట్స్ డిజైనింగ్ సంగతి సరే సరి.
అందుకే, ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఏఐ టూల్స్ వినియోగం కనిపిస్తోంది. సోషల్ మీడియా ఊరుకుంటుందా.? నెటిజనం ఆగుతారా.? అస్సలు ఆగట్లేదు.. అస్సలు తగ్గట్లేదు.!
ఫలితం, సెలబ్రిటీలు.. కోర్టు మెట్లెక్కాల్సి వస్తోంది.. భయంతో.! మమ్మల్ని అసభ్యకరంగా చూపిస్తున్నారంటూ, సెలబ్రిటీలు న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే.
ఔను మరి, హీరోయిన్లే కాదు.. హీరోలు కూడా.. అసభ్యకరమైన ఏఐ మార్ఫింగ్ బాధితులుగా మారిపోయారు మరి.!
హీరోలంతా ఆధిపత్య పోరు పక్కన పడేసి, చార్మినార్ దగ్గర చాయ్ తాగుతున్నట్లు ‘ప్రాంప్ట్’ ద్వారా అద్భుతమైన ఫొటోలు, వీడియోలు క్రియేట్ చేస్తుండడం అభినందనీయమే.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అర్థాన్ని మార్చేశారు..
అదే సమయంలో, హీరో – హీరోయిన్ల మధ్య అత్యంత అసభ్యకరమైన రీతిలో ‘అడల్ట్ వీడియోలు’ కూడా ఏఐ టూల్స్ ద్వారా క్రియేట్ చేసేసి, సోషల్ మీడియాలో వదులుతుండడం అత్యంత విషాదకరం.
బీటెక్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్.. అంటే, హుందాగా వుంటుంది.. సమాజానికి ఆ విద్యార్థి సమీప భవిష్యత్తులో ఉపయోగపడతాడు.
కానీ, ఏఐ టూల్స్.. సమాజంలో అలజడికి కారణమైతే.? కొంపల్లో చిచ్చు పెడుతోంటే.? జీవితాల్ని నాశనం చేసేస్తోంటే.? భయానకం.. అత్యంత భయానకరమైన పరిస్థితి ఇది.
దారుణమైన విషయమేంటటే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అంటే, బూతు బొమ్మలే కదా.. అన్న భావన జనాల్లోకి వెళ్ళిపోయింది.!
నిజానికి, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో.. అద్భుతాల్ని అత్యంత తేలికగా చేసెయ్యొచ్చు.
కానీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ 2025 సంవత్సరంలో సంచలనంగా దూసుకొచ్చి, జుగుప్సాకరంగా వార్తల్లోకెక్కుతోందిప్పుడు.
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. 2025 సంవత్సరాన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నామకరణంగా అభివర్ణించొచ్చు.. కారణం ఏదైనాసరే.!
వాస్తవం ఏంటంటే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఎన్నో అద్భుతాలు చేయగలిగాం.! జీవితాల్ని మరింత సుఖవంతంగానూ మార్చుకుంటున్నాం. ఈ మంచి కంటే, ఆ చెడుకే ఎక్కువ పబ్లిసిటీ దక్కుతోంది.
