ఆమెతో అది నిజమేగానీ.! రాజ్ తరుణ్ ‘నొక్కుడు’.!
Raj Tarun Lavanya Drugs.. లావణ్య అనే యువతితో సినీ నటుడు రాజ్ తరుణ్‌కి గత కొంత కాలంగా స్నేహం వుంది. స్నేహం కాదది, ఇద్దరూ కలిసి సహజీవనంలో వున్నారు.! పెళ్ళి కూడా జరిగిందట.
తాజాగా, రాజ్ తరుణ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ మోజులో పడి, పదకొండేళ్ళుగా సహజీవనం చేస్తోన్న తనను దూరం పెట్టాడన్నది లావణ్య ఆరోపణ.
ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, లావణ్యతో ‘రిలేషన్’ని రాజ్ తరుణ్ కూడా ఒప్పుకున్నాడు. ‘అది నిజమే’ అని స్పష్టం చేశాడు.
Raj Tarun Lavanya Drugs.. ట్విస్ట్ ఏంటంటే..
డ్రగ్స్ తీసుకుని, తనను నిత్యం వేధింపులకు గురిచేసేదంటూ లావణ్య మీద రాజ్ తరుణ్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ వ్యవహారం ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
నిజంగానే లావణ్య డ్రగ్స్ తీసుకుంటోంటే, ఆ విషయమై పోలీసులకు రాజ్ తరుణ్ సమాచారం అందించాలి కదా.? ఇదే ప్రశ్న మీడియా నుంచి రాజ్ తరుణ్‌కి ఎదురవుతోంది.
‘నేను సెలబ్రిటీని కదా, నా మీద అనవసరపు రచ్చ చేస్తారన్న భయంతోనే, ఆ విషయాన్ని దాచి పెట్టా’నంటూ రాజ్ తరుణ్ వ్యాఖ్యానించాడు. ఇది మరీ కామెడీగా వుంది.
వాస్తవానికి, డ్రగ్స్ అంటే చాలా పెద్ద వ్యవహారం. సీరియస్ క్రైమ్ కూడా.! ఇంట్లో డ్రగ్స్ తీసుకుంటున్న యువతితో రాజ్ తరుణ్ సహజీవనం చేశాడంటే, అది అతనికి ఇంకా డ్యామేజింగ్ వ్యవహారం కదా.?
లీగల్‌గా ప్రొసీడ్ అవుతాడట..
ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది.. దీన్ని చట్టపరంగానే ఎదుర్కొంటాను.. నాకు మీ (మీడియా) సహకారం అవసరం.. అంటూ మీడియా ప్రతినిథుల్ని ఉద్దేశించి రాజ్ తరుణ్ వ్యాఖ్యానించాడు.
మీడియా నుంచి సహకారం.. అంటే, ఎలాంటి సహకారాన్ని రాజ్ తరుణ్ కోరుకుంటున్నట్లు.? ఇదైతే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ క్వశ్చన్.
తప్పు జరిగింది.. రెండు వైపులా తప్పుంది.! అయితే, ఇదులో ‘నేరం’ అనే కోణం ఎంత.? అన్నది తేలాల్సి వుంది.