Sivaji Vs Anasuya Bharadwaj.. నటుడు శివాజీ ఏదో అన్నాడు.! నటి అనసూయ భరద్వాజ్ కూడా ఏదో అనేసింది.!
ఎవరూ అడగకుండానే, శివాజీ తన సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో హీరోయిన్లకు వస్త్ర ధారణ విషయమై బోడి సలహా ఇచ్చేశాడు.. బూతులు మాట్లాడాడు.
శివాజీ వ్యాఖ్యలపై, ఎవరో తనను ప్రశ్నిస్తే, ‘ఆయన చెప్పారని మేం మానేస్తామా.?’ అంటూ సెటైరేసింది అనసూయ. దాంతోపాటుగా, ‘ఇది నా శరీరం.. మీది కాదు’ అంటూ ట్వీటేసింది.. ఇంకేదో కామెంట్ కూడా చేసింది.
దాంతో, నువ్వెందుకమ్మా కలగజేసుకున్నావ్.? అంటూ, అనసూయ మీద గుస్సా అయ్యాడు శివాజీ. సరైన సమయం వచ్చినప్పుడు, బదులు తీర్చుకుంటాననీ స్వీట్ వార్నింగ్ ఇచ్చేశాడు.
అంతేనా, ‘అబ్బే, నా ఉద్దేశ్యం అది కాదు. హీరోయిన్‌కి అయ్యింది కదా.. అలాంటిదేదన్నా ఘటన అనసూయకీ జరిగితే, దాన్ని నేను ఖండించాలి కదా..’ అంటూ శివాజీ కవరింగ్ డైలాగ్ పేల్చాడు.
Sivaji Vs Anasuya Bharadwaj.. పాత గొడవలా.? కలిసికట్టుగా ఆడుతున్న డ్రామానా.?
ఇంతకీ, అనసూయ వర్సెస్ శివాజీ.. పాత పంచాయితీలు ఏమైనా వున్నాయా.? ఒకరి మీద ఒకరు ఎందుకు ఇలా రెచ్చిపోతున్నారు.? శివాజీ, స్వీట్ వార్నింగ్ తర్వాత.. అనసూయ మళ్ళీ స్పందించింది సోషల్ మీడియాలో.
చూస్తోంటే, పాత పంచాయితీలు ఇద్దరి మధ్యా వున్నాయనో.. లేదంటే, కలిసి కూడబలుక్కుని ఇద్దరూ ఈ వివాదాన్ని పెంచి పోషిస్తున్నారనో అనిపించకమానదు.
నో డౌట్, శివాజీ మాట్లాడిన ‘సామాన్ల’ భాష అత్యంత జుగుప్సాకరం. ‘దరిద్రపు ముండ’ అనే ప్రస్తావన అయితే, అతని నోటి విరేచనాలకు సాక్ష్యం.
అదే సమయంలో, వస్త్ర ధారణకు సంబందించిన సభ్యత, సంస్కారం అనేవి తప్పనిసరి ఎవరికైనా.! ఓ మగాడు, చిన్న చెడ్డీ వేసుకుని, రోడ్ల మీద తిరిగితే ఎలా వుంటుంది.? పిచ్చోడని అంటాం.

మహిళలు అరకొర దుస్తులు వేసుకుని రోడ్ల మీదకు వస్తే, అదే భావన కలుగుతుంటుంది. ‘ఇది నా శరీరం.. నీది కాదు’ అంటే, కుదరదు. సమాజంలో బతుకుతున్నాం కదా.!
సరే, ఈ డిబేట్ ఎప్పుడూ జరిగేదే.! జబర్దస్త్ కామెడీ షో సందర్భంగా, అనసూయ ఎన్ని అసభ్యకరమైన ఎపిసోడ్స్‌లో నిర్లజ్జగా నవ్వింది.? అన్న విషయాన్ని నెటిజనం, వీడియోలతో సహా బయటపెడుతున్నారు.
అది మళ్ళీ వేరే చర్చ.! ఎవరి గోల వారిదే.! గ్లామర్ అన్న పదానికి అర్థం మారిపోయింది. కామెడీకి అర్థం ఏనాడో జుగుప్సాకరంగా మారిపోయింది.
గొంగట్లో తింటూ, వెంట్రుకలు ఏరుకుంటే ఎలా వుంటుంది.? ఇదీ అంతే.! కానీ, శివాజీ వర్సెస్ అనసూయ.. ఏంటో, ఈ పంచాయితీ.! ఇదే ఎవరికీ అర్థం కావట్లేదు.
ఏకంగా, ఉరిశిక్ష వేయించేసుకుని తిరిగొస్తానంటాడు శివాజీ.! అనసూయ ట్వీట్ల యుద్ధం ఇంకోపక్క కొనసాగుతోంది. రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ అంతా గప్ చుప్.!
మళ్ళీ విజయ్ దేవరకొండ సినిమా వస్తే, అనసూయ నుంచి ఏదో ఒక కాంట్రావర్షియల్ ట్వీట్ రావడం కూడా మామూలే.! అది మళ్ళీ ఇంకో టైపు పంచాయితీ.!
