Anasuya Bharadwaj Aunty Tag.. అసలు ప్రగతి శీల మహిళ అంటే ఎవరు.? మహిళలపై నియంత్రణ కోల్పోతామన్న భయం ఎవరికి వుంటుంది.?
బలహీనమైన పితృస్వామ్య అహంకారం పోషించుకోవాల్సిన అవసరం ఎవరికి వుంది.?
సోషల్ మీడియా వేదికగా, అనసూయ భరద్వాజ్ ఇచ్చిన ఓ స్టేట్మెంట్ కాస్తా హాట్ టాపిక్ అయి కూర్చుంది.!
నిజమే, స్త్రీ పట్ల కొందరికి చిన్న చూపు వుండొచ్చు కదా.! అదే సమయంలో, పురుషుడంటే కూడా చిన్న చూపు అలానే వుంది కదా.!
మహిళలపై దాడులు జరుగుతున్నాయ్.. అలానే, మగాళ్ళని ముక్కలుగా నరికేసి, చంపేస్తున్న మహిళా మణుల్ని కూడా చూస్తున్నాం కదా మరి.!
Anasuya Bharadwaj Aunty Tag.. ప్రగతి శీల మహిళ..
ప్రగతి శీల మహిళ.. అని ఎలా అంటున్నామో, పురుషుల విషయంలో కూడా అలాంటి ప్రస్తావనే చెయ్యాలి కదా.! ఆకాశంలో సగం.. అన్నింటా సగం.!
కానీ, ఎక్కడా ఆ సమానత్వం కనిపించదు.! మగాళ్ళని మహిళలు దూషిస్తూనే వుంటారు.. మగాళ్ళకు సాటి మగాడే సాయం రాడు.! అదే, మహిళల విషయంలో వ్యవహారం వేరేలా వుంటుంది.
మహిళల్ని ఏ మగాడన్నా తిడితే, ఆ మగాడిని సాటి మగాళ్ళూ తప్పు పడతారు. మగాడ్ని ఆడాళ్ళు తిడితే, అది కరెక్టే.. అని మగాళ్ళూ అంటారు.
ఏ మహిళా ఓ మగాడికి మద్దతుగా నిలిచే పరిస్థితి వుండదు. మరి, సమానత్వం అనేది ఎక్కడ.? బలహీనమైన పితృస్వామ్య అహంకారం.. ఇదెక్కడి పంచాయితీ.? అసలు అర్థం పర్థం వుందా.?
ఏదేదో రాసుకుంటూ పోయింది అనసూయ భరద్వాజ్, సోషల్ మీడియా వేదికగా.! అనసూయ డ్రెస్ సెన్స్ ఎంత వరస్ట్‌గా వుంటుందో, స్వయంగా ఆమే చెప్పుకుంది.
కడుపున పుట్టిన కన్న బిడ్డ కూడా, అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ బాలేదని అంటాడట. ఈ విషయాన్ని స్వయంగా అనసూయ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

అనసూయ చెత్త డ్రెస్సింగ్ గురించి, ఆమె కొడుకే ‘అసహ్యంగా వుంది’ అని చెప్పినప్పుడు, అది సమాజానికి ఇంకెంత అసహ్యంగా కనిపిస్తుంది.?
ఆ సంగతి పక్కన పెడితే, తనను కావాలనే అందరూ ‘ఆంటీ’ అని ఎగతాళి చేస్తారంటూ అనసూయ తరచూ చెబుతుంటుంది. కానీ, ఎందుకు ఆమెనే అలా అంటారు.?
సినీ పరిశ్రమకు చెందిన చాలామంది నటీమణులు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు.. తల్లులయ్యారు.. వారెవర్నీ ‘ఆంటీ’ అని నెటిజనం ర్యాగింగ్ చెయ్యట్లేదు కదా.?
అప్పుడప్పుడూ, సోషల్ మీడియాలో పిచ్చి కామెంట్లు పడినా, ఎవరూ పట్టించుకోరు. చిరంజీవి లాంటి స్టార్ హీరోల మీద ‘తాత’ అంటూ ర్యాగింగ్ జరుగుతుంటుంది. దాన్ని చిరంజీవి ఎప్పుడైనా పట్టించుకున్నారా.?

అత్యంత అసభ్యకరమైన వస్త్రధారణ చేసినా, హీరోయిన్లపై ట్రోలింగ్ తాత్కాలికం. జుగుప్సాకరమైన అందాల ప్రదర్శన మీద నాలుగు కామెంట్లు వేసి ఊరుకుంటారు.
అనసూయ విషయంలో అలా కాదు.! ఎందుకంటే, ‘ప్రగతి శీల మహిళ’ కదా.! అందుకేనేమో, అనసూయని అంతా టార్గెట్ చేస్తారు. అంతేనా.?
ఇదిక్కడితో ఆగదు. ఇది సోషల్ మీడియా యుగం. ఏదో విషయం జరుగుతుంటుంది.. అనసూయ ‘రీచ్’ కోసం స్పందిస్తుంటుంది.. ఆమెకు కావాల్సిన రీచ్ దొరుకుంటుంది. ఇదొక నిరంతర ప్రక్రియ అంతే.!
