Anvesh Naa Anveshana Popularity.. సన్నీలియోన్ ఒకప్పుడు బూతు సినిమాల్లో నటించింది.. అదే, ఆమెకు గుర్తింపు.! ఆమె పుట్టి పెరిగిన దేశంలో అవన్నీ కామన్.!
బాలీవుడ్‌లోకి వచ్చింది, కొన్ని సినిమాల్లో నటించింది.. నటిస్తూనే వుంది. అడల్ట్ కంటెంట్‌ని ఎప్పుడో వదిలేసిందామె.!
భారత దేశంలోనూ బూతు కంటెంట్ మీద బతికేస్తున్నవాళ్ళు చాలామందే వున్నారు. షకీలా తెలుసు కదా.? ఆమెకు అప్పట్లో వున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు.
ఇప్పుడిది సోషల్ మీడియా యుగం. ఎవరికి వారే అడల్ట్ కంటెంట్ సొంతంగా తయారు చేసుకుని వదిలెయ్యొచ్చు. ఇదొక పైత్యం. ఇన్స్టాగ్రామ్ తెరిస్తే, బూతు వీడియోలు.. బూతు ఫొటోలే. ఫేస్బుక్, ట్విట్టర్ కూడా అంతే.
ఇంకా చాలా ప్లాట్‌ఫామ్స్ వున్నాయి. అడల్ట్ కంటెంట్ లైవ్‌గా దొరుకుతోంది. మరి, వ్యవస్థలు ఏం చేస్తున్నాయ్.? చేష్టలుడిగి చూస్తున్నాయ్.
Anvesh Naa Anveshana Popularity.. ఇంటర్నెట్ మీద అదుపు లేదు..
ఇంటర్నెట్ మీద అదుపు లేదు. అదుపు చేయడం అసాధ్యమేమీ కాదు. కాకపోతే, అదొక యాపారం.! లాభపాటి యాపారం.! అందుకే, ప్రభుత్వాలు ఇంటర్నెట్‌ని సెన్సార్ చేయడానికి ఇష్టపడ్డంలేదు.
ఇప్పుడిక, ‘నా అన్వేష్’ దగ్గరకి వద్దాం. వీడొక రోగ్.! వీడొక పోరంబోకు.! వీడొక అది, వీడొక ఇది. వీడిని తిట్టడానికి బూతులు సరిపోవు. అంత దరిద్రుడు వీడు.
సోషల్ మీడియా వేదికగా, అసభ్యకరమైన పదజాలంతో వీడియోలు వదులుతుంటాడు. వీడొక ప్రపంచ పర్యాటకుడు. కోట్లలో సంపాదన.
ఎలా సంపాదిస్తాడో, అలా ఖర్చు చేస్తాడు.. బ్రోతల్స్తో తిరుగుతూ, ఆ వీడియోలు కూడా పోస్ట్ చేస్తాడు. వీడి పైత్యానికి హద్దూ అదుపూ లేదు.
స్త్రీలు వస్త్రధారణ విషయమై, సీతా దేవి ప్రస్తావన తెస్తూ, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. ద్రౌపదిపైనా అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడు.
దాంతో, ‘నా అన్వేష్’ మీద మండిపడుతున్నారు చాలామంది. మొన్నామధ్య బెట్టింగ్ యాప్స్ వివాదంలో, పోలీసులకి ‘నా అన్వేష్’ గొప్పోడిలా కనిపించాడు. అప్పట్లో నీతులు చెప్పాడు మరి.
ముందే ప్రస్తావించుకున్నాం కదా.. ఇంటర్నెట్లో దేన్నీ నియంత్రించలేకపోతున్నాం. ‘నా అన్వేష్’గాడి పైత్యం విషయంలోనూ అంతే.
ఇప్పుడు జరుగుతున్నదంతా ‘నా అన్వేష్’ గాడికి ఫ్రీ పబ్లిసిటీ అంతే. అంతకు మించి ఏమీ వుండదు. ఎందుకంటే, వ్యవస్థల చేతకానితనం అలాంటిది.
నడుస్తున్న వివాదం నేపథ్యంలో, ‘నా అన్వేష్’గాడి యూ ట్యూబ్ ఛానల్‌ని అన్-సబ్‌స్క్రైబ్ చేయండి, రిపోర్ట్ చేయండి.. అంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.
లక్షలాది మంది ‘నా అన్వేష్’గాడి యూ ట్యూబ్ ఛానల్‌ని అన్-సబ్‌స్క్రైబ్ చేస్తున్నారు కూడా.! కానీ, దాని వల్ల వాడికొచ్చిన నష్టం పెద్దగా ఏమీ వుండదు.
ఎందుకంటే, ‘నా అన్వేష్’గాడు బరితెగించేశాడు. ముందు ముందు వాడివే నగ్న వీడియోలు, వాడే పోస్ట్ చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
అడల్ట్ కంటెంట్‌తో వీడియోలు చేసినా చేస్తాడు.. ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా.. ‘నా అన్వేష్’గాడి కంటే పెద్ద వెధవ ఈ భూమ్మీదే వుండడు. వాడ్ని అలా తయారు చేసింది ఇంటర్నెట్ యుగం.. ఇదింతే.!
సోషల్ టెర్రరిజం..
నిజానికి, నా అన్వేష్ ఒక్కడే కాదు.. ఇలాంటోళ్ళు చాలామందే వున్నారు. పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో.. వేల సంఖ్యలో వున్నారు.
కులం, మతం, ప్రాంతం.. ఇలా ఏది సేలబుల్ ఆబ్జెక్ట్ అయితే, దాన్ని పట్టుకుని సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతుంటారు.
డ్రగ్స్ స్మగ్లింగ్ కంటే, అత్యంత కిరాతకమైన నేరస్తులుగా వీళ్ళని పరిగణించాల్సి వుంటుంది. క్యాన్సర్ కంటే భయంకరమైన మమహ్మారిగా ఇలాంటి వాళ్ళ గురించి భావించాల్సి వస్తుంది.
ఎందుకంటే, వీళ్ల వల్ల సమాజానికి జరిగే హాని.. అంత తీవ్రమైనది గనుక.! సోషల్ మీడియా టెర్రరిస్టులుగా వీళ్ళకి నామకరణం చేసినా తప్పు కాదేమో.!
