Chiranjeevi Against Negativity.. మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.
ఈ నెల 12న థియేటర్లలోకి రానుంది ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా.!
ఒక్క రోజు ముందు, ప్రీమియర్స్‌తోనే ‘మన శంకర వర ప్రసాద్ గారు’ థియేటర్లలో సందడి చేయనున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన మూడు ఆడియో సింగిల్స్ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్’ సినిమాకి విక్టరీ వెంకటేష్ అదనపు గ్లామర్ అద్దుతున్నారు.
కేథరీన్ ట్రెసా తదితరులు ఈ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం.
కాగా, సినిమా ప్రారంభమైనప్పటినుంచీ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాపై నెగెటివిటీ చూస్తున్నాం. ఓ వర్గం పనిగట్టుకుని, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాపై దుష్ప్రచారం చేస్తూ వస్తోంది.
నెగెటివిటీ.. చిరంజీవి సినిమాకి మామూలే.!
కానీ, ‘మీసాల పిల్ల’ అంటూ సాగే సాంగ్ సంచలన విజయాన్ని అందుకుంది.. దాన్నీ, నెగెటివిటీ ఆపలేకపోయింది.! మిగతా రెండు ఆడియో సింగిల్స్, ట్రైలర్ విషయంలోనూ అంతే.
చిరంజీవి కెరీర్‌లోనే రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యింది ‘మన శంకర వర ప్రసాద్ గారు’.!
ఒక్కమాటలో చెప్పాలంటే, ‘ఓజీ’ సినిమా కోసం ఎదురుచూసినట్లుగా మెగాభిమానులు ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.
జయాపజాయలకు అతీతంగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో దూసుకెళుతున్నారు.
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ద్వారా సినిమాలకు దూరమైనా, రీ-ఎంట్రీలో ‘ఖైదీ నెంబర్ 150’తో ఏ స్థాయి విజయాన్ని చిరంజీవి అందుకున్నారో తెలిసిందే కదా.!
ఓ వర్గం మీడియా, ‘మన శంకర వర ప్రసాద్’ సినిమా మీదనే కాదు, చిరంజీవి ఆరోగ్యంపైనా దుష్ప్రచారానికి తెగబడింది.
డబ్బులిచ్చి మరీ సినిమాపై నెగెటివిటీ..
డబ్బులిచ్చి మరీ, ‘మన శంకర వర ప్రసాద్’ సినిమా మీద నెగెటివిటీ తీసుకొస్తున్నారు కొందరు. కానీ, ఇవేవీ ‘మన శంకర వర ప్రసాద్’ సినిమా ఫలితాన్ని అడ్డుకోలేవన్నది నిర్వివాదాంశం.
తొలి సినిమా దగ్గర్నుంచి, ఇప్పటిదాకా.. చిరంజీవి, నెగెటివిటీ అనే రక్కసితో యుద్ధం చేసి ప్రతిసారీ విజయం సాధిస్తూనే వున్నారు.
ఆ నెగెటివిటీ సంగతి ఎలా వున్నా.. సంక్రాంతికి, ‘మన శంకర వర ప్రసాద్’ సాధించబోయే విజయం.. తెలుగు సినీ పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ఆశిద్దాం.
