Megastar Chiranjeevi MSG.. చిరంజీవి అంటే.. చిరంజీవి అంతే.! మెగాస్టార్ చిరంజీవి అంటే, శిఖర సమానుడు.!
కొణిదెల శివ శంకర వర ప్రసాద్ కాస్తా, సుప్రీం హీరోగా.. మెగాస్టార్‌గా ఎదిగిన తీరు.. లక్షలాది మందికి.. కాదు కాదు, కోట్లాది మందికి స్ఫూర్తి.!
అప్‌కమింగ్ కొరియోగ్రాఫర్.. తాను, చిరంజీవి పాటకి కొరియోగ్రఫీ చేయడాన్ని తన లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్‌గా చెప్పుకోవడంలో వింతేముంది.?
ఆల్రెడీ సక్సెస్‌లు కొట్టిన దర్శకుడు, చిరంజీవితో సినిమా చేస్తూ.. ప్రతిక్షణం సెట్‌లో చిరంజీవిని చూస్తూ అచ్చెరువొందానని చెప్పుకుంటూ రావడం కూడా సహజమే.!
ఎందుకంటే, చిరంజీవి అంటే లివింగ్ లెజెండ్.! మెగాస్టార్ చిరంజీవిని నడిచే డిక్షనరీగా అభివర్ణిస్తారు చాలామంది. అది నిజం కూడా.!
నెత్తి మీద జుట్టు దగ్గరనుంచి, పాదంలోని చిటికెన వేలు వరకూ డాన్స్ చేస్తుంది.. అది కూడా పూర్తి గ్రేస్‌తో. దటీజ్ మెగాస్టార్ చిరంజీవి.
‘మన శంకర వర ప్రసాద్ గారు’ అనేది జస్ట్ సినిమా మాత్రమే కాదు, అంతకు మించి.! సినిమాటోగ్రాఫర్, లిరిసిస్ట్.. వాట్ నాట్.. చిరంజీవి, అందర్నీ ఇన్‌స్పైర్ చేశారు.!
ఏడు పదుల వయసులో మామూలుగా ఎవరైనా అయితే, కూర్చేని లేవడం కష్టం.. లేచి, కూర్చోవడమూ కష్టం. కానీ, చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కోసం వేసిన డాన్సులు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.
అందుకే, సహ నటుడు విక్టరీ వెంకటేష్, చిరంజీవిని అలా చూస్తూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో.
చిరంజీవి డాన్సుల్లో గ్రేస్.. చిరంజీవి కామెడీలో స్పాంటేనిటీ.. న భూతో న భవిష్యతి.! చిరంజీవి అంటే, చిరంజీవి అంతే.! వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి.!
ఏడు పదుల వయసులో హై ఓల్టేజ్ మెగా ఎనర్జీని, సిల్వర్ స్క్రీన్ మీద చూసేందుకు కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.
జస్ట్ మరి కొద్ది గంటల్లోనే ‘మన శంకర వర ప్రసాద్ గారు’ థియేటర్లలోకి వచ్చేస్తున్నారు.. పండగ తీసుకొస్తున్నారు.
