Tirumala Laddu Adulteration YSRCP.. అసలు అది నెయ్యే కాదు.! అలాంటప్పుడు కల్తీ నెయ్యి.. అని ఎలా అంటాం.? ఇదీ వైసీపీ క్యాడర్ వాదన. వైసీపీ అను‘కుల’ మీడియా వాదన కూడా ఇదే.!
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది, ‘మహా ప్రసాదం’ అయిన ‘లడ్డూ’.!
వెంకటేశ్వర స్వామిని ఎంత భక్తితో కొలుస్తామో, ఆ లడ్డూ ప్రసాదం పట్ల కూడా హిందువులు అంతే, భక్తితో వుంటారు.
మార్కెట్లో స్వీట్ షాపుల్లో దొరికే సాధారణ లడ్డూ కాదు, లడ్డూ ప్రసాదమంటే. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడింది వెంకన్న లడ్డూ ప్రసాదం.
అలాంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వైసీపీ హయాంలో వినియోగించారన్నది ప్రధాన ఆరోపణ. ఓ నివేదిక ఆధారంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన, అందర్నీ విస్మయానికి గురిచేసింది.
ప్రభుత్వాధినేతగా, తన రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయంలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంపై ముఖ్యమంత్రి ప్రకటన చేయడమే కాదు, విచారణకు కూడా ఆదేశించారు.
అలా కల్తీ నెయ్యి వ్యవహారం తెరపైకొచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం, ఈ వివాదానికి సంబంధించి, సీబీఐ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఈ కేసులో ఇప్పటిదాకా చాలా అరెస్టులు జరిగాయి.. కల్తీ నిజమని, దర్యాప్తు సంస్థ ఆల్రెడీ తేల్చింది. అయితే, నెయ్యి అస్సలు వాడకుండా, రసాయనాలతో నింపేశారన్నది సిట్ బృందం తేల్చిన అంశం.
అద్గదీ అసలు సంగతి.. నెయ్యే వాడలేదు కాబట్టి, కల్తీకి ఆస్కారమేది.? అంటూ వైసీపీ క్యాడర్, వైసీపీ అను‘కుల’ మీడియా చిత్రమైన వాదనను తెరపైకి తెస్తున్నాయి.
అంతలోనే, ప్రత్యేక దర్యాప్తు బృందం లడ్డూ ప్రసాదంలో స్వచ్ఛమైన నెయ్యినే వాడినట్లు తేల్చిందంటూ అదే వైసీపీ క్యాడర్, వితండవాదానికి తెరలేపడం గమనార్హం.
అసలు ఇదేం రాజకీయం.? వైఎస్ వివేకా డెత్ మిస్టరీకి సంబంధించి గొడ్డలి వేటుని గుండె పోటుగా ఏమార్చాలని ప్రయత్నించి విఫలమైన వైసీపీ, తిరుమ లడ్డూ విషయంలోనూ అదే వితండవాదానికి తెరలేపడమేంటి.?
నలుగురూ నవ్విపోదురుగాక వైసీపీకేటి సిగ్గు.?
