Kriti Sanon Rakshabandhan Vulgarity.. బాలీవుడ్ నటి కృతి సనన్, కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించింది.! ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమాలో ‘సీత’ పాత్రలోనూ కనిపించింది.
ట్రోలింగ్ ఆమెకి కొత్త కాదు.! ఎఫైర్స్.. అంటూ, గాసిప్స్ కాలమ్స్‌లో ఆమె పేరు కనిపించడమూ వింత కాదు.! గ్లామర్ విషయంలో ఎప్పుడో హద్దులు చెరిపేసింది కృతి సనన్.
మహేష్‌బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కృతి సనన్.! నటిగా ఎన్నో పురస్కారాల్ని ఆమె సొంతం చేసుకుంది.
కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ కూడా పలు సినిమాల్లో నటించింది. తెలుగులోనూ నటించింది నుపుర సనన్.
ఇప్పడిదంతా ఎందుకంటే, తాజాగా కృతి సనన్ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ని ఎదుర్కొంటోంది. విపరీతమైన నెగెటివిటీని చూస్తోంది.
‘నా శరీరం.. నా ఇష్టం.. నా దుస్తుల్ని బట్టి, నా క్యారెక్టర్‌ని జడ్జ్ చేస్తారా.?’ అంటూ ఆ ట్రోలింగ్, నెగెటివిటీపై గుస్సా అవుతోంది కృతి సనన్.
‘నా చెల్లెలు నుపుర్‌కి నేను రాఖీ కడతాను.. రక్షాబంధన్ ప్రాముఖ్యత ఏంటో నాకు తెలుసు..’ అంటూ తాజాగా నుపుర్ సనన్ సెలవిచ్చింది.. ట్రోల్స్‌పై గుస్సా అయ్యింది.
Kriti Sanon Rakshabandhan Vulgarity.. రక్షా బంధన్ ప్రకటనలో కృతి సనన్ జుగుప్స..
‘రక్షా బంధన్’ నేపథ్యంలో ఓ ప్రకటనలో నటించింది కృతి సనన్. అందులో, ఆమె వస్త్రధారణపై విమర్శలొచ్చాయి.
సోదరీమణులు, తమ సోదరులకు ‘రాఖీ’ కడతారు. తమ సోదరులు సంతోషంగా వుండాలని. సోదరీమణులకు అండగా వుంటామని ఈ సందర్భగా భరోసా ఇస్తారు సోదరులు.
మరి, రక్షా బంధన్ నేపథ్యంలో రూపొందించిన కమర్షియల్ యాడ్ ఎలా వుండాలి.? అందులో సోదరిగా కృతి సనన్ వస్త్రధారణ, సోదరుడి ముందు ఎలా వుండాలి.?
ఇదీ ప్రశ్న.! ఆమె వస్త్రధారణ ఆమె ఇష్టం. నిజానికి, ఆ కమర్షియల్ యాడ్‌ని డిజైన్ చేసిన దర్శకుడిని మొదట తప్పు పట్టాలి.. తప్పుపట్టాల్సి వస్తే.
ఇందులో కృతి సనన్‌కి బాధ్యత లేదా.? అంటే, వుంది.! ఏం ప్రకటనలో నటిస్తున్నాం.? ఏం ధరిస్తున్నాం.? అన్న సోయ వుండాలి.. బాధ్యత వుండి తీరాలి.. అన్నది చాలామంది అభిప్రాయం.
ప్రకటన చూస్తే, అందులో అసభ్యత సుస్పష్టం.. ఆమె వస్త్రధారణకు సంబంధించి.! ‘అంతా నా ఇష్టం..’ అంటే, ఇది మత విశ్వాసాలకు సంబంధించిన అంశం కూడా.!
ఏం, ఇతర మతాలకు సంబంధించిన పండుగల సమయంలో అసభ్యకరమైన వస్త్రధారణలతో ప్రకటనలు చేస్తారా.? అంటే, ఛాన్సే వుండదు.
ఏదిఏమైనా, ఇది జస్ట్ ట్రోలింగ్ కాదు.! ఒక ప్రశ్న.! సమాజం నుంచి వస్తున్న ప్రశ్న. హీరోలు అర్థనగ్నంగా పోజులిచ్చినా నెగెటివిటీని ఎదుర్కొంటున్నారు.
సో, కృతి సనన్ వస్త్రధారణ మీద వస్తున్న నెగెటివిటీకి ‘మహిళ కాబట్టి’ అనే పనికిమాలిన చర్చ అనవసరం. సినిమాల్లోనో, ఇతర కమర్షియల్ యాడ్స్‌లోనో కృతి సనన్ బికినీలో నటించినా విమర్శించడానికేం లేదు.
నడి రోడ్డు మీద విచ్చలవిడిగా తిరుగుతున్నా చాలామంది నటీనటుల్ని తప్పు పట్టడానికేమీ లేని రోజులివి.! కానీ, మత విశ్వాసాలకు సంబంధించిన ప్రకటనల విషయంలో.. వల్గారిటీ క్షమార్హం కాదు.
