Home » ‘టాక్సిక్’ సమీక్ష: హింస, అంగాంగ ప్రదర్శన.! ఇదేనా సినిమా అంటే.?

‘టాక్సిక్’ సమీక్ష: హింస, అంగాంగ ప్రదర్శన.! ఇదేనా సినిమా అంటే.?

by hellomudra
0 comments
Toxic Review

Toxic Review.. దర్శకుడు, దర్శకురాలు.. అబ్బే, ఇక్కడ ‘జెండర్’ డిపరెన్సెస్ ఏంటి.? అని కొందరంటారు.!

మహిళా దర్శకురాలు కదా, సెన్సిబులిటీస్ సినిమాలో బాగుండొచ్చు.. అని ఇంకొందరు అనుకున్నారు.!

‘కేజీఎఫ్’ సినిమాతో దేశం మొత్తాన్నీ ఊపేసిన నటుడు యష్, ‘టాక్సిక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడంటే, ఆ అంచనాలు వేరే లెవల్‌లో వుంటాయ్.

పైగా, ‘టాక్సిక్’ సినిమాకి గీతూ మోహన్ దాస్ దర్శకురాలు కావడం, సినిమా ఫస్ట్ లుక్ చాలా బాగా డిజైన్ చేయడం.. వెరసి, ‘టాక్సిక్’ గురించి సినిమా రిలీజ్‌కి ముందు దేశమంతా మాట్లాడుకోవడం జరిగింది.

సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేశాయ్. అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల వాయిదాల మీద వాయిదాలు పడినా.. ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది ‘టాక్సిక్’.!

సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో విద్యార్థులతో మాట్లాడుతూ (హైద్రాబాద్‌లో జరిగిన ఈవెంట్) ‘మేమేం గొప్పగా చేసెయ్యలేదు.. మీ భవిష్యత్తు గురించి గొప్ప గొప్ప కలలు కనండి.. సినిమాల్ని లైట్ తీసుకోండి’ అని చెప్పాడు యష్.

యష్ చెప్పిన ఉద్దేశ్యం వేరు.! కానీ, సినిమా చూశాక ‘సీరియస్‌గా తీసుకుని తప్పు చేశాం’ అనుకుంటారు చాలామంది.!

Toxic Review.. ‘టాక్సిక్’ కథా కమామిషు..

ఓ చిన్న గ్యాంగ్‌స్టర్.. చాలా పెద్ద గ్యాంగ్‌స్టర్ అవడం.. సోదరి హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం.. ఇదే మొత్తం కథ.!

తెరపై చూడ్డానికి గ్లామర్ పరంగా చాలామంది నటీమణులున్నారు. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణీ వసంత్, తారా సుతారియా, హ్యుమా ఖురేషీ.. ఆ నటీమణులు.

సోదరి పాత్రలో నయనతార నటించింది. గ్లామర్ విషయంలో మిగతావాళ్ళంతా అంచనాలకు మించి.. ‘షో’ చేశారు.!

అన్నట్టు, సినిమా ప్రమోషన్లలో నటీమణుల గ్లామర్ మీద చాలా డిబేట్ జరిగింది. ప్రమోషనల్ ఈవెంట్లలో దర్శకురాలి గ్లామర్ కూడా ‘హాట్’ టాపిక్‌గా మారింది.

కథ గురించి సింగిల్ లైన్‌లో చెప్పేసుకున్నాం కదా.! కథనం ఎలా వుందో మాట్లాడుకోవాలి మరి.! గజిబిజి గందరగోళం. సినిమాలో ఏ పాత్రతోనూ కనెక్ట్ కాలేం. తెరపై ఏదేదో జరుగుతుంటుంది.

అర్థరాత్రి ప్రీమియర్లకు వెళ్ళిన ప్రేక్షకులు, సినిమా ప్రారంభమైన కాస్సేపటికే నిద్రపోవాల్సి వచ్చింది. బీభత్సమైన సౌండింగ్ వున్నా సరే, నిద్రపోయారంటే.. అంతలా విసిగిపోయారన్నమాట.

ఇంటర్వెల్ వరకూ కూడా సినిమాని భరించలేక, చాలామంది ముందే వాకౌట్ చేసేశారు థియేటర్లలోంచి. యష్ మాత్రం స్టైలిష్ లుక్‌లో కనిపించాం.

కానీ, ‘కేజీఎఫ్’లో కనిపించిన రాకీ భాయ్ కాదు.! ఈ రాయ.. అస్సలు, ఆడియన్స్‌కి కనెక్ట్ కాలేదు. సోదరి హత్య జరిగింది.. హీరో రివెంజ్ తీర్చుకోవాలి.. అంటే, ఎంత ఎమోషనల్ టచ్చింగ్ వుండాలి.?

పోనీ, ఆ గ్లామర్ అయినా.. చూడబుల్‌గా వుందా.? అంటే, అదీ లేదాయె.! చాలా చిరాకు వచ్చేసింది.. కొంత అసహ్యంగా కూడా అనిపిస్తుంది.

కారుని ప్రయాణానికంటే, ఇతర వ్యవహారాలకి హీరో వాడేశాడు. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ విషయంలో నెగెటివిటీ వస్తుందనీ, ప్రేక్షకులు అసహ్యంగా ఫీలవుతారనీ అనుకోకపోవడమేంటో.?

నరకానికి వన్ వే..

ఒకట్రెండు డైలాగ్స్ గట్టిగా పేలాయ్. యష్ అభిమానుల్ని అలరిస్తాయ్. కొన్ని డైలాగుల్ని, ప్రేక్షకులు తమకు ఆపాదించుకుంటారు. ‘నరకానికి వన్ వే’ లాంటివన్నమాట.

థియేటర్లకు వెళ్ళడమంటే, నరకానికి వెళ్ళినట్లేనని ‘టాక్సిక్’ వీక్షకులు ఖచ్చితంగా అనుకుంటారు మరి.!

ఓ సీన్‌లో ‘తప్పు చేశావ్ గంగా’ అనే డైలాగ్ వస్తుంది. ఆ వెంటనే, ‘ఈ సినిమాకి వచ్చి తప్పు చేశాం’ అని కొందరు ఆడియన్స్ గట్టిగా అరవడం కనిపించింది.

సినిమా స్టైలిష్‌గా తెరకెక్కిందంటే, దానికి సినిమాటోగ్రఫీ ప్రధాన కారణం. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల చాలా బావుంది. పాటల్లో మ్యూజిక్ తేలిపోయింది.

నటీనటుల పెర్ఫామెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే, యష్ టాప్ క్లాస్. కంటెంట్‌లో విషయం లేకపోయినా, యష్ స్క్రీన్ మీద కనిపిస్తే, ఆ స్టైలిష్ పెర్ఫామెన్స్‌కి మైండ్ బ్లాంక్ అవుతుంది.

హీరోయిన్లలో ఎవరికీ అంత గొప్పగా నటించే ఛాన్స్ ఇవ్వలేదు దర్శకురాలు. ఆయా పాత్రల ఇంపాక్ట్ థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు అస్సలు వుండదు.

ఇతర పాత్రలేమీ అంతలా రిజిస్టర్ అవలేదంటే, దర్శకురాలు ఆ పాత్రల్ని బలంగా రాసుకోలేదనే కదా అర్థం.!

హీరోయిన్లు.. మందలు మందలుగా.. వృధాగా పడి వున్నారనే భావన కలుగుతుంది సగటు ప్రేక్షకుడికి. ‘పిల్లలు మా సినిమాకి రావొద్దు’ అని యష్ ముందే చెప్పేశాడు.

వయసుతో సంబంధం లేకుండా, ఎవరూ ‘టాక్సిక్’ చూడాల్సిన అవసరం లేదన్నట్టు సినిమాని వందల కోట్లతో గందరగోళంగా తెరకెక్కించేశారు.

అయినా, మూడు గంటల పదిహేను నిమిషాలపాటు ప్రేక్షకులకు నరకయాతన చూపించడానికి వందల కోట్ల రూపాయల్ని ఎందుకు వృధా చేసినట్లు.?

మొత్తంగా చూస్తే, ‘టాక్సిక్’ అనేది ఓ వృధా ప్రయాస.. అనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘టాక్సిక్’ సినిమాకి టిక్కెట్ ధరల పెంపు ఓ దండగమారి వ్యవహారం.!

ఈ సినిమా కోసమా.? ‘ఇరుముడి’ సినిమాని తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల నుంచి చాలావరకు తీసేసింది.? ఇది యాపారం.! కాకపోతే, బెడిసికొట్టింది.

ఫైనల్ టచ్: ‘టాక్సిక్’ చూడటం.. హానికరం.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group