Home » ఓ చిన్న డౌటానుమానం: నాలుగో ‘దృశ్యం’ అవసరమా.?

ఓ చిన్న డౌటానుమానం: నాలుగో ‘దృశ్యం’ అవసరమా.?

by hellomudra
0 comments
Drishyam4

Drishyam4 Zero Interest.. అప్పుడెప్పుడో చాలా ఏళ్ళ క్రితం ‘దృశ్యం’ అనే సినిమా వచ్చింది. దాన్ని తెలుగుతోపాటు, ఇతర భాషల్లోకీ రీమేక్ చేశారు.!

ఒకటి కాదు, రెండు కాదు.. ఇప్పటికే మూడు దృశ్యాలు చూసేశాం.! మూడో దృశ్యానికి పెద్దగా సీన్ లేకుండా పోయింది. జనం అంతలా పట్టించుకోలేదు.

ఇంతలోనే, నాలుగో ‘దృశ్యం’పై ప్రకటన వచ్చేసింది. తెలుగులో వెంకటేష్, ‘దృశ్యం’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. వెంకటేష్ ఈ సిరీస్‌లో తదుపరి సినిమాల్ని లైట్ తీసుకున్నాడు.

మరోపక్క, హిందీలో అజయ్ దేవగన్ ‘దృశ్యం’ సిరీస్‌లో కొత్త సినిమాల కోసం వేరే టీమ్స్ పెట్టుకున్నాడనుకోండి.. అది వేరే సంగతి.

ఇంతకీ, నాలుగో ‘దృశ్యం’ ఎందుకు తెరకెక్కించబోతున్నట్లు.? మోహన్‌లాల్, మీనా అలానే ఎస్తేర్ అనిల్ ఈ సినిమాలో కొనసాగే అవకాశాలున్నాయి.

ఎస్తేర్ అనిల్ బాల నటి ‘దృశ్యం’ సిరీస్‌లో మొదటి సినిమాకి. ఇప్పుడామె హీరోయిన్‌గా పలు సినిమాలు చేస్తోంది. మూడో ‘దృశ్యం’లో ఎస్తేర్ అనిల్ పాత్ర ఎవరికీ కనెక్ట్ కాలేదు.

ఇక, మూడో ‘దృశ్యం’లో మీనా నటన కూడా ‘ప్లాస్టిక్’ తరహాలో అనిపించింది. మోహన్‌లాల్ కూడా అంత కమిటెడ్‌గా మూడో ‘దృశ్యం’ చేయలేదేమో అనిపించింది.

‘దృశ్యం’ అనే పేరుకు వున్న పాపులారిటీ, జీతూ జోసెఫ్‌ అనే బ్రాండ్‌కి వున్న రేంజ్.. మోహన్‌లాల్ స్టార్‌డమ్.. ఇవన్నీ ఈ సిరీస్ కొనసాగడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు.

అయినాసరే, ‘సరుకు’ లేకపోతే, ఏ కథ అయినా ముందుకు నడవదు. కథ అక్కడే వుంటోంది. పోలీసుల చేతకానితనం ప్రతిసారీ ప్రూవ్ అవుతూ, బోర్ కొట్టేస్తోంది.

ఎత్తులకు పైయెత్తులు అంతలా ఆకట్టుకోవడం లేదు. వెరసి, ‘దృశ్యం’ నాలుగో సీజన్ ‘వృధా’ అన్న చర్చ, సినిమా ప్రారంభానికి ముందే అంతటా జరుగుతోంది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group