Nepal Flash Flood.. భారత దేశానికి తూర్పున బంగాళాఖాతం.. పశ్చిమాన అరేబియా సముద్రం.. దక్షిణాన హిందూ మహా సముద్రం.. అని పాఠ్యాంశాల్లో చదువుకుని వుంటాం చిన్నప్పుడు.!
దక్షిణాన హిమాలయాల గురించి ఇంకా ఇంకా గొప్పగా చదువుకున్నాం. హిమాలయాలంటే, ముందుగా గుర్తుకొచ్చేది పరమ శివుడు.!
మానస సరోవర్ యాత్ర.. అమర్నాథ్ యాత్ర.. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలా యాత్రలు ఇప్పుడు అందుబాటులో వున్నాయి. నేపాల్ వెళ్తున్నాం.. టిబెట్ వెళుతున్నాం.!
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం అనేది కేవలం పర్వతారోహకులకు మాత్రమే కాదు, సామాన్యులకి కూడా ఓ సరదా అయిపోయిందిప్పుడు.!
సరే.. ఇవన్నీ ఇప్పుడెందుకు.? అంటే, నేపాల్ వరదలు.. ఈ క్రమంలో ముంచెత్తిన బురద.. ఆ బురద కింద కూరుకుపోయిన బతుకులు.. ఇదీ ఇప్పుడు చర్చనీయాంశం.
Nepal Flash Flood.. భూకంపం కాదు.. ముంచెత్తింది..
భూకంపం వచ్చింది.. దాంతో, ఓ పెద్ద హిమనీనదం భళ్ళుమని బద్దలయ్యింది.. నదుల్లోకి నీరు వరదలా ఉప్పొంగింది.. దాంతో, బురద కమ్మేసింది.. అనేది ఓ వాదన.
ఇవేవీ కాదు.. కొండ చరియలు విరిగిపడ్డంతో, ఓ జలాశయం (హిమనీనదం) ఉప్పొంగిందనేది ఇంకో వాదన. ఏదైతేనేం, జరగరానిది.. జరగకూడనిది.. జరిగిపోయింది.
దాదాపు వెయ్యిమందికి పైగా గల్లంతయ్యారన్నది అప్పటికప్పుడు అధికారులు వేసిన ప్రాథమిక అంచనా. అసలెంతమంది ఆ బురదలో కూరుకుపోయారో అంచనా వేయడం అంత తేలిక కాదు.
ఏళ్ల తరబడి.. మృతదేహాలు వెలుగుచూస్తూనే వుంటాయి.. ఇలాంటి ప్రాంతాల్లో. ఉత్తరాఖండ్ వరదల్ని ఎలా మర్చిపోగలం.? ఆ విషాదాన్ని ఎలా మర్చిపోగలం.?
నేపాల్ విపత్తులో భారతదేశానికి చెందిన పర్యాటకులు పెద్ద సంఖ్యలో గల్లంతయ్యారు. దాదాపు రెండొందల మంది గల్లంతయినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇంతకీ, తప్పెవరిది.? ఈ పరిస్థితిపై చైనా ముందే హెచ్చరించలేదా.? నేపాల్, టిబెట్ ముందస్తు హెచ్చరికల విషయంలో లైట్ తీసుకున్నాయా.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయ్.
వైరల్ అవుతున్న వీడియోల్లో.. కొన్ని జల విద్యుత్ కేంద్రాలు దెబ్బ తిన్నట్లు కనిపిస్తోంది. పెద్ద పెద్ద కొండల మధ్య వంపులు తిరిగిన నదుల్ని ఆనుకుని, పెద్ద పెద్ద కట్టడాలు కట్టేసినట్లూ దర్శనమిస్తోంది.
దీనర్థం.. అభివృద్ధి పేరుతోనో, ఇంకో పేరుతోనో.. అడ్డగోలుగా ప్రమాదకర ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు చేసేశారని.! అంత చేశాక, ఇంత పెద్ద ప్రమాదంలో వింతేముంది.?
హిమాలయాల్లో భూకంపాలొస్తాయ్.. హిమాలయాల్లో హిమనీ నదాలు ఉప్పొంగుతాయ్.. ఇవన్నీ అందరికీ తెలుసు. ప్రకృతి ప్రకోపం ముందు మనిషెంత.? మనిషి బతుకెంత.? అన్న సోయ మనిషికుండాలి కదా.?
అభివృద్ధి పేరుతో భూమాత గుండెల్లో దించే ప్రతి గునపం.. ఏదో ఒక రోజు మనిషిని మింగేస్తుందనడానికి నేపాల్ విషాదం ఓ నిదర్శనం.!
అయినాసరే.. మనిషి మారడు.! పర్యాటకం పిచ్చిలో పడి.. ప్రమాదాల్ని కొనితెచ్చుకుంటున్నాడు. అభివృద్ధి పేరుతో దురాక్రమణలకు పాల్పడటం ఆపనంతవరకు.. ఇదింతే.!
