Chiranjeevi Irumudi Review.. ‘ఇరుముడి’ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి సూపర్బ్ రివ్యూ ఇచ్చారు సోషల్ మీడియా వేదికగా.! రివ్యూ మాత్రమే కాదు, ఓ మంచి మాట కూడా చెప్పారు.!
హీరో రవితేజ గురించీ, ఈ సినిమాలో నటించిన బేబీ నక్షత్ర గురించీ, దర్శకుడు అలాగే నిర్మాతల గురించీ.. మెగాస్టార్ చిరంజీవి ఆ రివ్యూలో తనదైన అభిప్రాయాల్ని వెల్లడించారు.
‘త్రినాథ్’ పాత్రలో రవితేజ ఒదిగిపోయిన తీరు గురించీ, దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాని తెరకెక్కించిన తీరు గురించీ అద్భుతంగా కొనియాడారు చిరంజీవి.
Chiranjeevi Irumudi Review.. ఫైనల్ టచ్..
ఫైనల్ టచ్ కాదు.. ఫైనల్ పంచ్ అనాలేమో.! అంతే మరి, అలాంటి ఆసక్తికరమైన కామెంట్ చిరంజీవి చేయడం చర్చనీయాంశంగా మారింది.
‘‘ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ.. ఏ కొందరిదో కాదు. మనం బతకాలి.. ఇతరులనూ బతికించాలి!’’ అంటూ తన ట్వీటుని ముగించారు మెగాస్టార్ చిరంజీవి.
అసలు, ఈ కామెంట్ ఎందుకు మెగాస్టార్ చిరంజీవి చేయాల్సి వచ్చింది.? అంటే, చిరంజీవి ఎప్పుడూ చెప్పే మాటే ఇది.!
ఈ మధ్య చాలా సినిమాలకి విడుదలకన్నా ముందే నెగెటివిటీ కనిపిస్తోంది. రకరకాల వివాదాలు సినిమాల్ని చుట్టుముడుతున్నాయి.
ఇంకోపక్క, తెలుగు సినిమాల్ని డబ్బింగ్ సినిమాలతో దెబ్బ తీస్తున్నారు కొందరు. డబ్బింగ్ రైట్స్ కొనుక్కొచ్చి, స్ట్రెయిట్ సినిమాల మీద పోటీకి దించుతున్నారు కొందరు నిర్మాతలు.
అదే సమయంలో, సినీ పరిశ్రమ మీద కులాల పంచాయితీని రుద్దుతున్నారు మరికొందరు. ఇలాంటి వ్యవహారాలన్నిటిపైనా, ఓ అస్త్రంలా చిరంజీవి తన ట్వీటుని సంధించారన్న చర్చ జరుగుతోంది.
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. తెలుగు సినీ పరిశ్రమకి పెద్దన్న మెగాస్టార్ చిరంజీవి.! ఒక సినిమా విజయం.. పరిశ్రమలోని అందరిదీ.. అన్న చిరంజీవి మాట నూటికి నూరు పాళ్ళూ నిజం.
ప్రతి సినిమానీ మన సినిమానే.. అని సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ అనుకోగలిగితే.. మొత్తంగా తెలుగు సినీ పరిశ్రమ బాగుపడుతుంది. ఆ రోజెప్పుడొస్తుందో ఏమో.!
