బిగ్‌హౌస్‌లో నీరసం ఆవహించింది. కెప్టెన్సీ టాస్క్ పేరుతో కొంత ఎనర్జీ హౌస్‌లో (Bigg Boss Nagarjuna Graph) కనిపించినా, ఆ టాస్క్‌కి తగ్గ ఎనర్జీ కంటెస్టెంట్స్ ఎవరూ ప్రదర్శించలేకపోయారు. అలీ కెప్టెన్ అయ్యాడంతే.
అసలేమౌతోంది బిగ్‌బాస్‌లో.? నాగార్జున గత వీకెండ్‌లో ఇచ్చిన షాక్‌కి కంటెస్టెంట్లు కంగారు పడ్డారా.? అందరూ సేఫ్ గేమ్ అడడం మొదలు పెట్టారా.? ఇలాగైతే బిగ్‌బాస్ మిగతా ఎపిసోడ్స్ భరించలేనంత నీరసంగా చూడాల్సి వస్తుందేమో.
ఒక్కసారిగా బిగ్‌హౌస్ నీరసించి పోవడం. చూసే ఆడియన్స్‌కి పెద్ద షాక్ ఇస్తోంది. సీరియస్‌నెస్ హౌస్‌లో అస్సలేమాత్రం లేదు. అలాగని ఫన్ ఉందా.? అంటే అదీ లేదు. బలవంతంగా తెచ్చుకున్న నవ్వులు, తప్పదన్నట్లు నడుస్తున్న టాస్క్‌లు.. వెరసి ‘బిగ్‌బాస్’ కంప్లీట్ డల్ మూడ్‌లోకి వెళ్లిపోయింది.
హిమజకు కొంచెం ఎనర్జీ వచ్చినట్లు కనిపించింది. అషూ రెడ్డి ఏదో మాట్లాడాలని అనుకుంటోంది.. అంతే. అంతకుమించి షోలో అసలు ఎనర్జీనే లేదు.అప్పుడప్పుడూ శ్రీముఖి వికారపు కేకలు షోని మరింత డైల్యూట్ చేసేస్తున్నాయి. వరుణ్, వితికల మధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా ఆకట్టుకోవడం లేదు.
తెలుగు బిగ్‌బాస్ పూర్తిగా డల్ అయిపోతే, తమిళ బిగ్‌బాస్ మాత్రం ఏదో ఒక హ్యాపెనింగ్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇదిలా ఉంటే, లేటెస్ట్ టాస్క్‌లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఘట్టం చాలా హాస్యాస్పదంగా మారింది. వరుణ్, వితికల మ్యారేజ్ యానివర్సరీ ఎప్పుడు.? అన్న ప్రశ్నకు సమాధానం వరుణ్‌ని చెప్పనివ్వలేదు.
వితిక అపోజిషన్ టీమ్‌లో ఉంది. వరుణ్ కాకుండా, మిగతా వాళ్లంతా ఆన్సర్ చెప్పారు. ఇంత చెత్త టాస్క్ ఇంకేమైనా ఉంటుందా.? రాఖీ పండుగ సెలబ్రేషన్స్ కొంచెమైనా ఎనర్జీని తీసుకొస్తాయనుకుంటే, అక్కడా నిరాశే ఎదురైంది. రాహుల్‌కి తప్ప, మిగిలిన అందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు చెప్పిన పునర్నవి, కాస్త హైలైట్ అయ్యిందంతే.
స్వాతంత్య్ర దినోవ్సవ వేడుకల సందర్భంగా హౌస్ మేట్స్ చేసిన స్కిట్స్ ఆలోచింపచేసే విధంగా లేవు సరి కదా, బోర్ కొట్టించేశాయి. ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్.. ఇప్పటి దాకా జరిగిన థర్డ్ సీజన్‌లో ఇంతవరకూ ఎప్పుడూ లేనంత డల్ ఎపిసోడ్స్ ఈ వీక్‌లోనే జరిగాయి.
వీకెండ్‌లో నాగార్జునే బిగ్‌బాస్‌ని (Bigg Boss Nagarjuna Graph) ఆదుకోవాలి. అంతకు మించి వేరే దారి లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, హౌస్‌మేట్స్ నిద్ర మోడ్‌లోకి వెళ్లిపోయినట్లున్నారు. వారిని నిద్ర లేపితే తప్ప షో మళ్లీ ట్రాక్ ఎక్కదు.
మరి, హౌస్‌మేట్స్‌లో అలముకున్న నీరసాన్ని తగ్గించి, వారిని నాగ్ ఉత్సాహపరిచే విధంగా ‘అదిరింది బాస్’ అని ఆడియన్స్ చేత అనిపించగలుగుతాడా.? వేచి చూడాల్సిందే.