Home » ముద్రాభిప్రాయమ్: వివాహం.. వైవాహిక బంధం.. రెండూ వేర్వేరా.?

ముద్రాభిప్రాయమ్: వివాహం.. వైవాహిక బంధం.. రెండూ వేర్వేరా.?

by Mudra369 Editorial Desk
0 comments
Nithya Menen

Wedding Bonding Divorce.. వివాహం, వైవాహిక బంధం.. అన్నీ ఒకటే కదా.? కాదు కాదు, పెళ్ళి అనేది ఓ వేడుక.

వైవాహిక బంధం అంటే, వివాహం జరిగాక, భార్యాభర్తలిరువురూ కలిసి జీవించడానికి అవసరమయ్యేది.

అసలు పెళ్ళి చేసుకోవడమంటేనే, ‘ముడి పడటం’ కదా.! ముడిపడటం అంటే, ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడమే కదా.!

రోజులు మారాయ్.! పెళ్ళి అంటే, ఇప్పుడు జస్ట్ ఓ వేడుక మాత్రమే.! ‘ముడి పడటం’ ఆ వేడుకలో జరుగుతోంది.. కానీ, ఆ ‘ముడి’ బలంగా ఎన్ని గంటలు వుంటుందన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.

ఇలా పెళ్ళి చేసుకుని, అలా విడాకులు తీసుకుంటున్న ‘కేసులు’ రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అందుకే, ‘ఈమాత్రం దానికి అట్టహాసంగా పెళ్ళి ఎందుకు.?’ అన్న చర్చ తెరపైకొస్తోంది.

Nithya Menen Wedding Bonding Divorce.. జెన్ జీ ట్రెండ్..

నిజమే, యువతీ యువకులు పెళ్ళి పట్ల ఇటీవలి కాలంలో ఇష్టం చూపకపోవడానికి ఇదీ ఓ కారణం.! ఒకర్ని ఒకరు అర్థం చేసుకుంటే సరిపోతుంది.. దానికి పెళ్ళితో పని లేదన్నది ‘జెన్ జీ’ ఉవాచ.

పిల్లల్ని కనడానికి పెళ్ళి చేసుకోవాల్సిన అవసరమేముంది.? అని పలువురు సెలబ్రిటీలు వివిధ సందర్భాల్లో వ్యాఖ్యానించడం చూస్తున్నాం.

సింగిల్ పేరెంట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నారు కదా.. ఈ ‘జెన్ జీ’ ఆలోచనల వల్లనే.

మూడుముళ్ళ బంధంతో ఒక్కటై, కలిసి కాపురం చేయలేక, కొట్టుకుచచ్చేకన్నా.. విడిపోవడమే బెటర్.. అనే అభిప్రాయం బలపడటానికి చాలా కారణాలున్నాయి.

ఇక, సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా సరదాగా పెళ్ళి గురించీ, విడాకుల గురించీ.. ప్రస్తావించడం మీడియాకి పరిపాటిగా మారిపోయింది.

నిత్యా మీనన్ దృష్టిలో పెళ్ళంటే..

ఏదో సందర్భంలో నటి నిత్యా మీనన్, తనకు పెళ్ళి మీద పెద్దగా ఆసక్తి లేదని చెప్పడం, అప్పట్లో హాట్ టాపిక్. పెళ్ళి అంటే అయిష్టత ఏమీ లేదని తాజాగా సెలవిచ్చింది.

పెళ్ళి కంటే, బలమైన బంధం గురించే ఎక్కువ ఆలోచిస్తానంటూ, నిత్యా మీనన్ తాజాగా ఇచ్చిన వివరణ ఒకింత ఆసక్తికరంగా మారింది.

కాలం మారుతోంది.. ఈ క్రమంలో పెళ్ళి అనేది ఓ మూఢ నమ్మకంగా మారిపోతోంది కొందరి దృష్టిలో. మేజర్లయిన యువతీ యువకులు కలిసి జీవించడం తప్పు కాదిప్పుడు. నేరం అసలే కాదు.

సో, పెళ్ళితో పనేంటి.? బంధం బలంగా వున్నంతకాలం కలిసి వుండటం.. తేడా వస్తే, ‘బ్రేకప్’ చెప్పేసుకుని, స్నేహితుల్లా కొనసాగడం.. ఇదీ నయా ట్రెండ్.

తప్పొప్పుల పంచాయితీ..

లేటు వయసులోనూ విడాకులు ఈ మధ్య పెరిగిపోతున్నాయి. సెలబ్రిటీల గురించి వార్తలొస్తాయ్.. సామాన్యుల గురించి వార్తలు రావు.. అంతే తేడా.!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘విడాకుల వ్యవహారం’ ఓ రాజకీయ పార్టీకి, జాతీయ సమస్యగా మారిపోతుంటుంది. అది వేరే చర్చ.

తమిళనాడులో ఓ మంత్రి, తన సతీమణికి ఇచ్చిన విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఇలాంటివి చాలానే జరుగుతుంటాయి.

అంతెందుకు, తమిళనాడు సీఎం విజయ్ మీద, అతను సీఎం అవకముందే, ఆయన భార్య విడాకుల కోసం కోర్టుకెళ్ళిన విషయమై పెద్ద పొలిటికల్ రచ్చ జరిగింది.

తప్పెవరిది.? అన్న చర్చ కంటే ముందు.. ఏది తప్పు.? ఏది ఒప్పు.? అన్న చర్చకే ఆస్కారం వుండటం లేదు. ఎవరి కోణంలో వారు కరెక్ట్.! ఇదీ నయా జమానా.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Editor's Picks

Most viewed

trending

© 2026, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group