NVDIA Jensen Huang Returns.. ఎన్విడియా అంటే, ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీ.. అని అందరికీ తెలుసు. రాత్రికి రాత్రి, ఈ సంస్థ వివాదాల్లోకెక్కింది.
ఏకంగా సీఈవో జెన్సెన్ హువాంగ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సంక్షోభం దెబ్బకి లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది.. మదుపరులు నష్టపోయారు.
ప్రపంచ వ్యాప్తంగా కంపెనీ బ్రాండ్ వాల్యూ తగ్గిపోయింది. జెన్సెన్ హువాంగ్ సంపద కూడా తగ్గిపోయింది.! వేల కోట్లు కాదు.. లక్షల కోట్ల వ్యవహారమే అంతా.!
చైనాకి చెందిన సీక్రెట్ ఏజెంట్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్నది జెన్సన్ హువాంగ్‌పై ఆరోపణ.
అక్రమ సంబంధం నిజమేగానీ, ‘సీక్రెట్స్ ఏవీ రివీల్ చేయలేదు’ అంటూ జెన్సన్ హువాంగ్, సిగ్గు లేకుండా వివరణ ఇచ్చుకున్నాడు. దాంతో, అతన్ని పీకి పారెయ్యాల్సి వచ్చింది.
మరీ దారుణంగా ‘పీకి పారెయ్యాల్సి వచ్చింది’ అనడం సబబు కాదేమో.! కానీ, ఈ ఉత్పాతం వల్ల నష్టపోయిన మదుపరులు అలానే అనుకున్నారు.. శాపనార్ధాలూ పెట్టారు.
కానీ, జెన్సన్ హువాంగ్ రాజీనామాతో ఒక్కసారిగా వచ్చిన కుదుపుని ఎన్విడియా సంస్థ తట్టుకోలేకపోయింది. వేడి కాస్త తగ్గగానే, తిరిగి ఆయన్ని సీఈవో పదవిలో కూర్చోబెట్టింది.
దాంతో, సంస్థ మళ్ళీ కోలుకుంది.. సంపద కూడా పూర్వ స్థితికి చేరుకోవడానికి మార్గం సుగమం అవుతోంది. మరి, బ్రాండ్ వాల్యూ సంగతేంటి.?
టెక్ రంగంలో, ఎన్విడియాకి వున్న పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇన్నీ కావు. జెన్సన్ హువాంగ్ దెబ్బకి కాస్త ఇబ్బంది పడినా, కోలుకుంది.!
అయితే, ఇక్కడితో ‘ఆల్ సెట్’ అనుకోవడానికి వీల్లేదు.! వ్యవహారం మళ్ళీ మొదటికి రావొచ్చు. జెన్సన్ హువాంగ్ మీద విచారణ ఏదైనా షురూ అయితే, అంతే సంగతులు.
‘వద్దు బాబోయ్..’ అంటూ మదుపరులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. లక్షల కోట్ల సంపద ఆవిరైపోతే, మదుపరులు సర్వనాశనమైపోతారు మరి.!
ఔను, ఇదంతా ఇప్పుడు తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారైంది పరిస్థితి.
‘మళ్ళొచ్చాడు.. నిండా ముంచెయ్యడానికి..’ ఇదీ, సాధారణ మదుపరులు, ఎన్విడియాలోకి జెన్సన్ హువాంగ్ రాకపై వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు.
ప్రపంచంలో ఎక్కడో ఏదో జరిగితే మనకేంటి.? అనుకోవడానికి లేదు. బటర్ ఫ్లై ఎఫెక్ట్.! ఎక్కడ ఇలాంటి ఉత్పాతం జరిగినా, ప్రపంచమంతా ఉలిక్కిపడుతోంది.