మీరూ ఇదే బాపతా.? జర జాగ్రత్త.. ఖర్సయిపోతారు.!

 మీరూ ఇదే బాపతా.? జర జాగ్రత్త.. ఖర్సయిపోతారు.!

Parul Gulati

Laptop Work Healthy Angle.. పొద్దున్న లేస్తూనే, మొబైల్ ఫోన్ చూస్తున్నారా.? నిద్ర కళ్ళతో మొబైల్ ఫోన్ చెక్ చేసుకుంటోంటే, ఏమీ కనిపించడంలేదా.?

ఇది స్మార్ట్ యుగం.! స్మార్ట్ ఫోన్‌ని బాత్రూమ్‌లో కూడా విచ్చలవిడిగా వాడేస్తుండడం చూస్తున్నాం. అది లేకుండా ఏ ‘పనీ’ జరగడంలేదు మరి.!

ఔను, బాత్రూమ్ కమోడ్ మీద కూర్చుని, ‘మల విసర్జన’ చేస్తూ, మొబైల్ ఫోన్‌లో ప్రపంచాన్ని చూసెయ్యడమంటే.. ఆ స్థాయికి దిగజారిపోయాం.!

కంప్యూటర్.. కళ్ళకు కట్టేసుకుని.!

పైన చెప్పుకున్న పంచాయితీ ఒకటి.! ఇక్కడ చెప్పుకుంటున్న విషయం ఇంకోటి.! రెండూ దాదాపుగా ఒకలాంటివే. కాకపోతే, ఇది ‘వర్క్’ సంబందిత వ్యవహారం.

వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా, ల్యాప్‌టాప్‌లను కళ్ళకు కట్టేసుకుంటున్నాం.! ఇదిగో, నిద్ర మత్తు వీడకుండా, మంచమ్మీద నుంచి దిగకుండానే ‘పని’ మొదలు పెట్టేయాల్సి వస్తోంది.

మీరు కూడా ఇలాగే చేస్తున్నారా.? అయితే, మీ జీవితం ఖర్సయిపోతున్నట్టే లెక్క.! అదేంటి.? సంపాదిస్తున్నాం కదా.. ఖర్చయిపోవడమేంటి.? అంటే, నిజంగానే ఖర్చయిపోతోంది.

విలువైన కాలం, అంతకు మించి ఆరోగ్యం.. ఇదిగో, ఇలాంటి పనుల వల్లనే ఖర్చయిపోతోంది.!

Laptop Work Healthy Angle.. జర జాగ్రత్త సుమీ.!

ల్యాప్‌టాప్ ఒళ్ళో పెట్టుకుని.. మంచమ్మీద పడుకుని.. మన మీద దాన్ని కూర్చోబెట్టుకుని.. పని చేసేస్తుంటే.. ఆ కిక్కే వేరప్పా.. అనుకుంటాం.

కానీ, ముందే చెప్పుకుంటున్నట్లు.. ఇవి ‘కొంపలు ముంచేసుకునే’ వ్యవహారాలు.! అందుకే, అప్రమత్తంగా వుండండి.

‘వర్క్’ కోసం కొంత సమయాన్ని ప్రత్యేకంగా ఎలాగూ సమయం కేటాయిస్తాం. అలాగే, మన కోసం కూడా మనం సమయాన్ని కేటాయించుకోవడం తప్పనిసరి.

‘మాకు కుదరదండీ..’ అంటే సరిపోదు.! గడియారంలో 24 గంటలు.. ప్రపంచంలో అందరికీ సమానమే.!

అన్నట్టు, వర్కింగ్ పొజిషన్ మరీ ముఖ్యం.! మొబైల్ ఫోన్ వాడటానికైనా.. ల్యాప్‌టాప్ వినియోగంలో అయినా.! మీకర్థమవుతోందా.?

Digiqole Ad

Related post