Home » సొగసుల్ సోయగాల్.! మైకోనోస్ మెరుపు తీగ ప్రగ్యా జైశ్వాల్

సొగసుల్ సోయగాల్.! మైకోనోస్ మెరుపు తీగ ప్రగ్యా జైశ్వాల్

by Mudra369 Editorial Desk
0 comments
Pragya Jaiswal

Mykonos Beauty Pragya Jaiswal.. వెకేషన్ల పేరు చెప్పి సెలబ్రిటీలు విహార యాత్రలకు వెళ్లడం పరిపాటి.

తాజాగా అందాల భామ ప్రగ్యా జైశ్వాల్ కూడా వెకేషన్ కోసం వెళ్లింది. అక్కడి ప్రకృతి సోయగాల్ని తన అందాలతో జోడించి కెమెరాలో బంధించేసింది.

ఆ ఫోటో పోజులు నెట్టింట హాట్ హాట్‌గా చక్కర్లు కొడుతున్నాయ్. ఇంతకీ ప్రగ్యా విహార యాత్రలో భాగంగా సందర్శించిన ప్రదేశం ఏంటంటారా.? యూరప్ ఖండంలోని గ్రీసు దేశంలో వున్న మైకోనోస్ ద్వీపం.

ఏజియన్ (Aegean sea) సముద్రంలోని ప్రసిద్ధ ద్వీప సముదాయాల్లోని ఒక భాగం ఈ ప్రాంతం. గ్రీస్ నగరానికి ఆగ్నేయ దిశగా సుమారు 150 కిలో మీటర్ల దూరంలో ఏజియన్ సముద్రంలో వుంటుంది.

మైకోనోస్ ద్వీపం ప్రత్యేకతలేంటీ.?

అందమైన బీచ్‌లు, ప్రత్యేకమైన పూల తోటలు, పచ్చదనం నిండిన విల్లాలకు ప్రసిద్ధి. ఇక్కడి కట్టడాలన్నీ తెల్ల రంగు రాళ్లతో నిర్మించబడి చూసేందుకు ఆకర్షణీయంగా వుంటాయ్.

ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీలు, పర్యాటకులు వెకేషన్ నిమిత్తం ఇక్కడకి విచ్చేసి ఇక్కడి విలాసవంతమైన భవనాల్ని, బీచ్‌లను ఎంజాయ్ చేస్తుంటారు.

Pragya Jaiswal
Pragya Jaiswal

సముద్రానికి ఎదురుగా కొండల అంచున వున్న ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్స్, మరియు పూల చెట్లతో నిండిన భోగన్ విల్లా రిసార్టులు ఇక్కడ ప్రత్యేకం. ఈ లొకేషన్లు ఫోటో షూట్లకు, పర్ఫెక్టుగా నిలుస్తాయ్.

Mykonos Beauty Pragya Jaiswal.. రిసార్ట్ వ్యూ – రిలాక్డ్స్ మూడ్

అందుకే సెలబ్రిటీలకు ఈ ప్రాంతం చాలా ఫేవరేట్. ప్రస్తుతం ప్రగ్యా జైశ్వాల్ షేర్ చేసిన ఈ ఫోటోలు మైకోోనోస్‌లోని ఓ లగ్జరీ రిసార్ట్ బాల్కనీ నుంచి షూట్ చేసినవే.

చుట్టూ నీలి సముద్రం, దూరంగా తెల్లటి రాతి కట్టడాలు.. భారీ స్విమ్మింగ్ పూల్ ఆమె ఫోటోలకు మరింత అందాన్నిచ్చాయ్.

ఓ ట్రాన్స్‌పరెంట్ లేస్‌తో కవర్ చేసిన బికినీలో ప్రగ్యా జైశ్వాల్ ఈ స్పెషల్ ఫోటో షూట్ చేయించుకుంది.

Pragya Jaiswal
Pragya Jaiswal

ఈ మధ్య ‘స్లిప్ డిస్క్’ సమస్యతో తన నడుము భాగాన్ని వెనక్కి వంచడానికి చాలా కష్టపడ్డానని చెప్పిందీ పొడుగు కాళ్ళ సుందరి.

ప్రగ్యా జైశ్వాల్.. యోగా, క్రమశిక్షణతో కూడిన వ్యాయామాలు చేసి ఆ సమస్యను ఆధిగమించానని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group