Dimple Hayathi Marriage Gossips.. కొన్నాళ్ళ క్రితం ఓ వివాదానికి సంబంధించి పోలీసుల్ని ఆశ్రయించాల్సి వచ్చింది నటి డింపుల్ హయాతీకి.!
ఆ సమయంలో డింపుల్ హయాతీకి పెళ్ళయ్యిందనే ప్రచారం చాలా చాలా గట్టిగా జరిగింది.
కానీ, తాజాగా తనకు పెళ్ళి కాలేదంటూ డింపుల్ హయాతీ ఓ నెటిజన్ ప్రశ్నకి బదులిచ్చింది. ఇంతకీ, డింపుల్ హయాతీకి పెళ్ళయ్యిందా లేదా.?
డింపుల్ హయాతీ తాజా చిత్రం ‘భోగీ’ ప్రమోషన్ల నేపథ్యంలో హీరో శర్వానంద్‌తో ఆమె ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
శర్వానంద్‌కి ఆల్రెడీ పెళ్ళయ్యింది.. డింపుల్ హయాతీకి పెళ్ళయిపోయిందిరోయ్.. అంటూ, నెటిజన్ ఓ కామెంట్ చేశాడు సోషల్ మీడియాలో.
Dimple Hayathi Marriage Gossips.. నాకింకా పెళ్ళి కాలేదు..
ఈ ప్రశ్నకే బదులిస్తూ, తనకు పెళ్ళి కాలేదని స్పష్టతనిచ్చింది డింపుల్ హయాతీ. కాగా, శర్వానంద్ విడాకులు తీసుకోబోతున్నాడనీ, డింపుల్ హయాతీని పెళ్ళాడబోతున్నాడనీ గాసిప్స్ పుట్టుకొచ్చాయి.
అయితే, ఈ గాసిప్స్‌ని ‘భోగీ’ దర్శకుడు సంపత్ నంది కొట్టి పారేశాడు. ఓ సినిమాలో కలిసి నటించిన నటీనటుల మధ్య ఇలాంటి గాసిప్స్ ఎందుకొస్తాయో అర్థం కావట్లేదని సంపత్ నంది చెప్పుకొచ్చాడు.

అద్గదీ అసలు సంగతి.! ఏ సినిమాలో నటించినా డింపుల్ హయాతీ చుట్టూ ఈ తరహా గాసిప్స్ ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయాయి.
ఆ మాటకొస్తే, నటీనటుల మధ్య ఈ తరహా గాసిప్స్ ఓ ట్రెండింగ్ వ్యవహారమైపోయింది. రామ్ పోతినేని – భాగ్యశ్రీ బోర్సే.. పెళ్ళి పీటలెక్కబోతున్నారంటూ వినిపించిన గాసిప్స్ సంగతి సరే సరి.
ట్రోలింగ్ కంటెంట్ అంతే..
మీడియాకి కంటెంట్ కావాలి.. సోషల్ మీడియాకి ట్రోలింగ్ కంటెంట్ కావాలి.! అలా, ఇప్పుడు శర్వానంద్, డింపుల్ హయాతీ.. ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయారన్నమాట.
గాసిప్పులకీ ఈ ఇద్దరూ ఇప్పుడు భలే కంటెంట్ అయి కూర్చున్నారు.! వీళ్ళ మధ్య గాసిప్స్ వల్ల సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ వచ్చిందన్న విషయాన్ని కాదనగలమా.?
Also Read: బొట్టు, గాజులు, పూలు.. భర్తతోనే వెళ్ళిపోవాలా.?
అన్నట్టు, ఈ సినిమాలో నటించిన అసలు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, సినిమా ప్రమోషన్లకు దూరమైంది.
తనకన్నా ఎక్కువ పబ్లిసిటీ డింపుల్ హయాతీకి వస్తుండడం వల్లే అనుపమ, సినిమా ప్రమోషన్లకు దూరమైందన్నది ఇంకో గాసిప్.
అలాంటిదేమీ లేదు, తాను వేరే సినిమా షూటింగ్‌లో వుండడం వల్లేనంటూ అనుపమ పరమేశ్వరన్ స్పష్టతనివ్వాల్సి వచ్చిందనుకోండి.. అది వేరే సంగతి.