Mahesh Rajamouli Varanasi Postponed.. మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్లో ‘వారణాసి’ పేరుతో ఓ వెండితెర అద్భుతం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈ ‘వారణాసి’ సినిమా కోసం దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో, ప్రపంచ సినీ ప్రేక్షకుల్ని తనవైపుకు తిప్పుకున్న రాజమౌళి, ఆ సినిమాని ఆస్కార్ వేదికపైకెక్కించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ‘వారణాసి’ సినిమా స్కేల్ మరింత పెరిగింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ‘వారణాసి’ విడుదల కావాల్సి వుంది.
అయితే, తాజాగా వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం చూస్తే, ‘వారణాసి’ సినిమా, ముందు అనుకున్నట్లుగా ఏప్రిల్‌లో విడుదలయ్యే అవకాశాలు కనిపించడంలేదట.
Mahesh Rajamouli Varanasi Postponed.. వీఎఫ్ఎక్స్ పనుల ఆలస్యం వల్లేనా వాయిదా.?
వీఎఫ్ఎక్స్ పనులు కాస్త ఆలస్యమయ్యేలా వుండటంతో, తదుపరి బెస్ట్ డేట్ కోసం ‘వారణాసి’ టీమ్ ఎదురు చూస్తోందన్నది తాజా గాసిప్స్ సారాంశం.
అయితే, ఇంతవరకు ‘వారణాసి’ సినిమాపై వస్తున్న ఈ గాసిప్స్‌పై దర్శకుడు రాజమౌళి స్పందించలేదు. ‘వారణాసి’ టీమ్ ఈ విషయమై ఒకింత వ్యూహాత్మక మౌనం ప్రదర్శిస్తోంది.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా కంటే ముందు, రాజమౌళి ఏ సినిమా చేసినా.. ఒకింత ఎక్కువ ఆలస్యమే అయ్యేది మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కోసం.
Also Read: ఐవరీ లుక్స్‌లో తమన్నా భాటియా.. న్యూ స్టైలింగ్ అదరహో.!
‘ఆర్ఆర్ఆర్’ విషయంలో, పనులు ఒకింత వేగంగా జరిగినా, కోవిడ్ సహా.. అనేక కారణాలు, సినిమాని కాస్త ఆలస్యం చేశాయి.
‘వారణాసి’ విషయంలో, ఆలస్యం జరగకూడదని రాజమౌళి చాలా ఖచ్చితమైన షెడ్యూల్స్ అత్యంత పకడ్బందీగా వేసుకున్నాడు.
అయినాగానీ, ‘వారణాసి’ ఆలస్యమయ్యేలానే కనిపిస్తోంది. ఏడాది మారిపోతుందా.? అన్న విషయమైనా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి ‘ఆలస్యానికి’ సంబంధించి.
ఎందుకంటే, ఓటీటీ డీల్స్ నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా అంటే, నెలల తరబడి ఆ వాయిదా కొనసాగుతూ వెళుతోంది మరి.!
ఎప్పుడొచ్చినా, ‘వారణాసి’ ప్రపంచ సినిమా స్క్రీన్ మీద అద్భతమే అవుతుందన్నది ఇన్సైడ్ సోర్సెస్ నుంచి అందుతున్న సమాచారం.!
ఇక, ‘ఆలస్యం – వాయిదా’ విషయమై వస్తున్న గాసిప్స్ అన్నీ, ఉత్తి పుకార్లుగానే మిగిలిపోయి, సినిమా అనుకున్న సమయానికే ప్రేక్షకుల ముందుకు రావాలని బలంగా కోరుకుందాం.
‘వారణాసి’లో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.