Table of Contents
Pawan Kalyan Strengthen JSP.. స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపకాలు, జన సేన పార్టీని నిండా ముంచేశాయి.! పేరుకే కూటమి.. పెత్తనమంతా తెలుగు దేశం పార్టీదే.!
ఒక్క మాటలో చెప్పాలంటే, సీట్ల పంపకాలకు సంబంధించి, పెద్దన్న పాత్ర పోషించాల్సిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, మోసపూరితంగా వ్యవహరిస్తున్నారు మిత్రపక్షాల విషయంలో.
కాస్తో కూస్తో, భారతీయ జనతా పార్టీ ఈ పంపకాల్లో లాభపడుతున్నమాట వాస్తవం. దారుణంగా నష్టపోతున్నది మాత్రం జన సేన పార్టీనే.!
కార్పొరేషన్, మునిసిపాలిటీలు.. ఇలా అన్నిట్లోనూ జన సేన పార్టీ, ‘సీట్ల పంపకాల’ విషయంలో నష్టపోయింది. కార్యకర్తలు, నాయకులు.. తీవ్రస్థాయిలో నష్టపోయారు.
జన సేన అధినేత పవన్ కళ్యాణ్, ‘బేరసారాల్లో’ రాణించలేకపోతున్నారు. పార్టీకి తగినన్ని సీట్లను కూటమి నుంచి తీసుకురాలేకపోతున్నారు.
Pawan Kalyan Strengthen JSP.. పవన్ మొహమాటం.. జన సేనకి ప్రాణ సంకటం..
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, పవన్ కళ్యాణ్ మొహమాటం జన సేన పార్టీకి ప్రాణ సంకటంగా మారుతోంది. గ్రామ పంచాయితీ ఎన్నికల విషయంలో ఇది మరింత దారుణంగా తయారైంది.
చివరి నిమిషంలో, ‘మీ ఇష్టం, మీరెలాగైానా ఎక్కడైనా పోటీ చేయొచ్చు..’ అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు పార్టీ నాయకులు, కార్యకర్తలకు జన సేనాని పవన్ కళ్యాణ్. కానీ, అప్పటికే పూడ్చలేని డ్యామేజ్ జరిగిపోయింది.
పంచాయితీ ఎన్నికల ఫలితాలొచ్చాయ్.. జన సేన పార్టీ దారుణ ఫలితాల్ని చవిచూసింది. నిజానికి, ఇవి పార్టీల గుర్తుల మీద జరిగే ఎన్నికలు కావు.
ఎవరు గెలిచినా, ఆయా పార్టీల అభ్యర్థులు కారు.. వాళ్ళంతా ఆయా పార్టీల మద్దతుదారులు మాత్రమే.
పోటీ చేస్తేనే కదా.. బలమెంతో తెలిసేది.?
అయినాసరే, జన సేన మద్దతుదారులు గెలిచిన గ్రామ పంచాయితీలు చాలా చాలా తక్కువేనని స్పష్టమవుతోంది. ఇదే జన సేన నాయకులకు, కార్యకర్తలకు అస్సలేమాత్రం మింగుడు పడ్డం లేదు.
‘మనం బలంగా వున్న చోటే పోటీ చేస్తాం’ అని ఈ మధ్య నాదెండ్ల మనోహర్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఆ వాదన నూటికి నూరు పాళ్ళూ తప్పే.
పోటీ చేస్తేనే కదా.. బలం వుందో, లేదో తెలిసేది.! పంచాయితీ ఎన్నికల్ని జన సేన ప్రతిష్టాత్మకంగా తీసుకుని వుండాల్సింది. కానీ, అలా జరగలేదు. అందుకే, ఫలితం అనుభవిస్తోంది.
వైసీపీ, ఈ పంచాయితీ ఎన్నికల్లో గెలవడం జన సేన పార్టీకి దారుణమైన దెబ్బగా చూడాల్సి వుంటుంది. అందుకే, జన సేనాని పవన్ కళ్యాణ్ రాజకీయంగా గేరు మార్చడం ఇప్పుడు తప్పనిసరి.
మీడియా సపోర్ట్ ఎలా.?
మీడియా సపోర్ట్ లేకపోవడం కూడా జన సేన పార్టీకి పెద్ద లోటు. పత్రికల్లో, ఛానెళ్ళలో కనిపిస్తున్న పంచాయితీ ఎన్నికల ఫలితాల లెక్కలకీ, జన సేన వాస్తవంగా గెలిచిన లెక్కలకీ అసలు పొంతనే లేదు.
2029 ఎన్నికల నాటికి, జన సేన పార్టీకి మీడియా బలం వుండాలి.. అన్ని స్థానాల్లోనూ పోటీ చేయగలిగే స్థాయికి జన సేన పార్టీ రాజకీయంగా ఎదగాలి.
కార్యకర్తలు, నాయకులుగా ఎదగడానికి రానున్న రెండేళ్ళు అత్యంత కీలకం జన సేన పార్టీకి. ఆ దిశగా జన సేనాని, జన సేన పార్టీని బలోపేతం చేసుకోపోతే.. రాజకీయంగా నిలదొక్కుకోవడం అసాధ్యం.