Home » నిరుద్యోగ ప్రపంచమ్.! కోట్లాది మంది ఉద్యోగాలు పోతాయ్.!

నిరుద్యోగ ప్రపంచమ్.! కోట్లాది మంది ఉద్యోగాలు పోతాయ్.!

by Mudra369 Editorial Desk
0 comments
Artificial Intelligence

Artificial Intelligence Jobless Youth.. వందల్లో వేలల్లో కాదు.. కోట్లలో నిరుద్యోగుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోనుంది.! ఇది ఏ ఒక్క దేశానికో సంబంధించిన సమస్య కాదు.!

ఈ భూమ్మీదనున్న సమస్త మానవాళీ రానున్న నిరుద్యోగ సునామీని ఎదుర్కోవాల్సిందే.! ఇంతటి మహోత్సాతానికి కారణమేంటి.? ఇంకేంటి, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.!

ఇప్పటికైతే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించే వింటున్నాాం.. ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఆర్టిపీషియల్ సూపర్ ఇంటెలిజెన్స్.. ఇలా కొత్త కొత్త పేర్లు మనకి పరిచయం కాబోతున్నాయ్.

ప్రపంచ వ్యాప్తంగా నిరుద్యోగ సెగని చూస్తున్నాం. ఉద్యోగాలు పోతున్నాయ్. పది మంది చేసే పని ఒక్కరు చేసెయ్యగలగడం కాదు.. వందల మంది చేసే పని, ఒక్కరితో అయిపోతోంది.!

Artificial Intelligence Jobless Youth.. ప్లేస్మెంట్ల జాడ లేదు.. భవిష్యత్తు కనిపించడంలేదు..

ఔను, ఏఐ సాయం వుంటే.. వందలాది మంది చేసే పని ఒక్కరే చేసెయ్యగలరు. అలాంటప్పుడు, ఏ సంస్థ అయినా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగుల్ని ఎందుకు నియమించుకుంటుంది.?

అత్యున్నత విద్యా సంస్థల్లో గత కొన్నాళ్ళుగా ప్లేస్మెంట్ల జాడ కనిపించడంలేదు. ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు, కొత్త ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు ఇవ్వడం తగ్గించేశాయి.

సీనియర్ మోస్ట్ ఉద్యోగుల్ని తొలగించేస్తున్నారు.. ఫ్రెషర్స్‌కి అనుభవం కావాలంటూ షరతులు పెడుతున్నారు. వెరసి, సమీప భవిష్యత్తులో ‘నిరుద్యోగోత్పాతాన్ని’ చూడబోతున్నామన్నమాట.

‘అబ్బే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోవు.. కొత్త ఉద్యోగాలు వస్తాయ్..’ అంటూ నిన్న మొన్నటిదాకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినవాళ్ళే ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితి.

భస్మాసురహస్తాన్ని మనమే తయారు చేసి నెత్తిన పెట్టుకున్నాం..

పరిస్థితి దాదాపుగా చెయ్యదాటిపోయింది.! మరి, ప్రపంచం ఈ నిరుద్యోగ భూతాన్ని ఎలా ఎదుర్కోబోతోంది.? ఇదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న.!

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికిప్పుడు అంతమైపోతే బావుణ్ణు.. ఇదీ, ఇప్పుడు అందరి నుంచీ వినిపిస్తున్న ఆవేదనాభరితమైన మాట.! అది జరగని పని.!

ఎందుకంటే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అంటే, భస్మాసురహస్తం. దాన్ని మనమే తయారు చేసుకుని, మన నెత్తిన పెట్టుకున్నాం.. తప్పించుకోలేం.!

రానున్న ఐదేళ్లలో 2.4 కోట్ల మంది ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలు కోత్పోతారని జేమీ మోర్గాన్ వెల్త్ మేనేజ్మెంట్ నివేదిక కఠోరమైన వాస్తవాన్ని బయటపెట్టింది.

పరిస్థితి తీవ్రత రానున్న ఏడాది, రెండేళ్ళలోనే అంతకు మించి వుండబోతోంది. గెట్ రెడీ ఫర్ ది ఇంపాక్ట్.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Editor's Picks

Most viewed

trending

© 2026, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group