Home » జగన్, షర్మిల కలిసే ‘యెలహంక ప్యాలెస్’ డ్రామా ఆడుతున్నారా.!?

జగన్, షర్మిల కలిసే ‘యెలహంక ప్యాలెస్’ డ్రామా ఆడుతున్నారా.!?

by Mudra369 Editorial Desk
0 comments
Jagan Sharmila

Jagan Sharmila Yelahanka Drama.. ‘యెలహంక’ ప్యాలెస్ చుట్టూ చాలా పెద్ద డ్రామా నడుస్తోంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిలా రెడ్డి మధ్యన.!

తాజాగా, ఈ డ్రామాలోకి వైఎస్ విజయలక్ష్మీ రెడ్డి కూడా ఎంట్రీ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తిగా యెలహంక ప్యాలెస్ గురించి అందరికీ తెలుసు.

కానీ, కొత్త ట్విస్ట్ ఏంటంటే, ఇది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి తల్లికి చెందిన ఆస్తిగా ఓ వాదన తెరపైకి రావడం.!

ఈ మేరకు, యెలహంక ప్యాలెస్‌లోకి వైఎస్ షర్మిల కుటుంబ సభ్యులను రానీయకుండా, భారతీ రెడ్డి తల్లి దగ్గర లీజుకు తీసుకున్న కంపెనీ, కోర్టును ఆశ్రయించింది.

న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో, పోలీసులు తాజాగా షర్మిల, విజయమ్మ ఆ ప్యాలెస్‌లో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారు. దాంతో, వివాదం ముదిరి పాకాన పడింది.!

Jagan Sharmila Yelahanka Drama.. ఇది మామూలు ఫ్యామిలీ డ్రామా కాదు..

అయితే, ఇదంతా ఓ పొలిటికల్ డ్రామాలా మారిందిప్పుడు.! అంతకన్నా మించి, ఇదొక రసవత్తరమైన కుటుంబ డ్రామా అయి కూర్చుంది.

మరో పెద్ద డౌటానుమానం ఏంటంటే, జగన్ అలానే షర్మిల కలిసికట్టుగానే ఈ డ్రామా రక్తికట్టిస్తున్నారా.? అని.! జరుగుతున్న పరిణామాలు చూస్తోంటే, ఈ డ్రామా నిజమే కావొచ్చనిపించడం ఖాయం.

వైఎస్ షర్మిల కుమార్తె పెళ్ళి, ఈ ప్యాలెస్‌లో నిర్వహించాలని నిర్ణయించుకున్నారట.! దానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడ్డు పుట్ట వేశారట.. అది కూడా భద్రతా కారణాల రీత్యా.

Ys Sharmila Vijayamma
Ys Sharmila Vijayamma

ఎవరి పెళ్ళి.? షర్మిల కుమార్తె పెళ్ళి. అంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్వయానా మేనకోడలు అవుతుంది పెళ్ళి కూతురు. ఈ లెక్కన, అసలు మేనమామ ఎందుకు అడ్డం పెడతాడు.?

షర్మిల కుటుంబం, బెంగళూరులోని యెలహంక ప్యాలెస్‌లో నివసిస్తోంది గత కొన్నాళ్ళుగా. మరి, హైద్రాబాద్‌లోనో.? లేకనేం, లోటస్ పాండ్ వుంది కదా.!

పెద్ద పెద్ద కుటుంబాలకి, ఒక్కో నగరంలో ఒక్కోటి.. అంతకు మించిన ప్యాలెస్సులు వుండటం సహజమే. పెద్ద పెద్ద అంటే, డబ్బున్న కుటుంబాలని అర్థం.

రాష్ట్రానికి ఇదొక్కటే సమస్యా.?

చాలా ఏళ్ళుగా షర్మిల కుటుంబం, యెలహంక ప్యాలెస్‌లో వుంటోంది. మరి, ఇప్పుడే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భద్రతా పరమైన ఇబ్బందులు ఎందుకు వచ్చినట్లు.?

అసలంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో షర్మిల కుమార్తె పెళ్ళి, యెలహంక ప్యాలెస్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తులు.. ఇవి తప్ప, ఇంకో సమస్యే లేదన్నట్లు తయారైంది వ్యవహారం.

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.! ఈ ఇద్దరూ కలిసే, మొత్తం డ్రామాని రక్తికట్టిస్తున్నారన్నది సుస్పష్టం.!

ఈ మొత్తం డ్రామాలోకి విజయమ్మ ఎంట్రీ ఇచ్చిన దరిమిలా, యెలహంక డ్రామా కొత్త మలుపు తిరిగినట్లయ్యింది.! అయినా, ఇదేం కుటుంబం.? ఈ ఆస్తుల పంపకాల గోలేంటి.?

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Most viewed

trending

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group