Home » దీపం దారి చూపించింది.! తమిళనాట సరికొత్త ప్రభంజనమిది.!

దీపం దారి చూపించింది.! తమిళనాట సరికొత్త ప్రభంజనమిది.!

by Mudra369 Editorial Desk
0 comments
Tiruparankundram Deepam

Thiruparankundram Deepam Supreme Court.. దీపం దారి చూపిస్తుందన్నది అందరికీ తెలిసిన విషయమే.! దీపం అంటే వెలుగు.. అందుకే, సనాతన హిందూ ధర్మంలో దీపానికి అంత ప్రాముఖ్యత వుంటుంది.!

ఇక, తమిళనాడు అంటే, ప్రముఖ మురుగన్ దేవాలయాలకు కేరాఫ్ అడ్రస్.! కార్తీక దీపం అనగానే, అందరికీ అరుణాచలం గుర్తుకొస్తుంది.

కానీ, తమిళనాడులోని చాలా దేవాలయాల్లో ఈ దీప సంస్కృతి వుంది. అలాంటి ఓ ప్రముఖ దేవాలయమే, తిరుపరంకండ్రంలో వున్న మురుగన్ ఆలయం.

ఆ ఆలయం వెనుక వున్న కొండ మీద ఏటా కార్తీక మాసంలో దీప స్థంభంపై దీపాన్ని వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది. వందల ఏళ్ళుగా ఇదొక సంప్రదాయమైపోయింది.

Thiruparankundram Deepam Supreme Court.. దీపమే దారి చూపించింది..

కానీ, దీప స్తంభం వద్ద కాకుండా, వేరే చోట దీపం వెలిగించి వివాదానికి కారణమైంది తమిళనాడులోని జోసెఫ్ విజయ్ ప్రభుత్వం.

హైకోర్టు మొట్టికాయలేసినా, సుప్రీంకోర్టు స్వయంగా చీవాట్లు పెట్టినా.. తమిళనాడు ప్రభుత్వం దొంగ వేషాలు వేసింది, చివరికి సుప్రీంకోర్టుకి క్షమాపణ చెప్పింది.

కానీ, సుప్రీంకోర్టు ఆ క్షమాపణని అంగీకరించలేదు. జరిగిన తప్పుని సరిదిద్దడం తమ బాధ్యత.. అంటూ, సంచలన తీర్పునిచ్చింది.

సుప్రీంకోర్టు తాజా తీర్పుతో, రేపు.. అంటే, నవంబర్ 28, శనివారం తిరుపరంకుండ్రంలోని మురుగన్ ఆలయం వెనుక వున్న కొండపై, దీపపు స్తంభం మీదనే దీపాన్ని వెలిగించాల్సి వచ్చింది.

జోసెఫ్ విజయ్ ప్రభుత్వానికి చెంప పెట్టు..

మొత్తం, దేవాలయ ప్రాంగణం అలాగే, కొండ ప్రాంతాన్నీ, ఆ మాటకొస్తే, తిరుపరంకుండ్రం పట్టణాన్ని కూడా సీఆర్‌పీఎఫ్ భద్రతా దళాల పర్యవేక్షణలో వుంచాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఇంతకు ముందు, ఐదుగురితో దీపం వెలిగించాలని న్యాయస్థానం తీర్పు వెల్లడించగా, దీపం వెలిగించాలనుకున్నవారందరినీ అనుమతించాలని తాజా తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొనడం గమనార్హం.

ఇది, నిజంగానే తమిళనాట సరికొత్త ప్రభంజనంగా మారింది.! న్యాయస్థానం కనీ వినీ ఎరుగని రీతిలో అత్యద్భుతమైన తీర్పు, అదీ సీఎం జోసెఫ్ విజయ్‌కి చెంప పెట్టులాంటి తీర్పు.. అన్న చర్చ జరుగుతోంది.

ఇది మురుగన్ తీర్పు..

తెగేదాకా లాగిన తమిళనాడు ప్రభుత్వం, తమిళనాడులోని హిందూ భక్తుల మనోభావాలతో చెలగాటమాడినందుకు ఫలితం అనుభవిస్తోంది.

ఈ కేసులో, తమిళనాడు చీఫ్ సెక్రెటరీ సహా మొత్తం ఎనిమిది మంది అధికారులకు కోర్టు ధిక్కరణ కింద న్యాయస్థానం నోటీసులు జారీ చేయడం గమనార్హం. అంటే, అసలు కథ ఇప్పుడే మొదలైందన్నమాట.

ఇది సాదా సీదా తీర్పు కాదు.. మురుగన్ స్వయంగా ఇచ్చిన తీర్పు.. అంటూ, తమిళనాట సంబరాలు షురూ అయ్యాయ్.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Editor's Picks

Most viewed

trending

© 2026, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group