Table of Contents
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan The Power King) సినిమా రిలీజవుతోందంటే ఆ కిక్కే వేరు. అంతకు ముందు వచ్చిన సినిమా రిజల్ట్‌తో అస్సలేమాత్రం సంబంధం వుండదు. సినిమా సినిమాకీ అంచనాలు ఆకాశాన్నంటేస్తుంటాయి. ఆ పవర్ అలాంటిది.
పవన్ కళ్యాణ్ అభిమానులు ‘పవర్ స్టార్’ అని పిలిచినా, ‘పవర్ కింగ్’ అంటూ ఆయన్ని అభిమానించే ఓ గాయకుడు పిలుచుకున్నా.. పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే ఓ ‘పవర్’ ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోతుంటుంది ఆయన్ని అభిమానించేవారిలో.
ఏముంది పవన్ కళ్యాణ్‌లో (Power Star Pawan Kalyan) అంత ప్రత్యేకత.? అది ఆయన్ని అభిమానించేవారికి మాత్రమే తెలుసు. ‘పవనిజం’ అంటూ ఓ ‘ఇజం’ క్రియేట్ చేసేసుకున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఆయనలో ఎంత ప్రత్యేకత లేకపోతే.. ఆయన్ని అంతలా అభిమానించేస్తారు.? సినిమా హిట్టయినా.. ఫట్టయినా పవన్ కళ్యాణ్‌పై ‘క్రేజ్’ అస్సలేమాత్రం తగ్గదు. ఆ మాటకొస్తే, ఏనాడూ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ లెక్కల గురించి పట్టించుకోలేదు.
కమిట్‌మెంట్, డెడికేషన్‌కి కేరాఫ్ అడ్రస్
‘సినిమా కోసం పనిచేయాలనుకున్నప్పుడు, ప్రాణం పెట్టేయడమొక్కటే తెలుసు’ అంటాడాయన. ఆ కమిట్‌మెంట్ అభిమానులకు బాగా నచ్చుతుంది. జస్ట్ సినిమా అభిమానులే కాదు, తెరపై ఆయన్ని చూసి విజిల్స్ వేయడమే కాదు.. అంతకు మించిన ప్రత్యేకతని పవన్ కళ్యాణ్‌లో (Pawan Kalyan The Power King) ఆయన అభిమానులు చూస్తున్నారు. అదే, వ్యక్తిత్వం. ఎవరైనా ఎన్నయినా విమర్శలు చేయొచ్చుగాక. కానీ, అలా విమర్శించేవారికీ తెలుసు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వమేంటో.
ఎవరికో చెంచాగిరీ చేయాలి కాబట్టి, పవన్ కళ్యాణ్‌ని అడ్డగోలుగా విమర్శిస్తారుగానీ.. అంతకు మించి నిఖార్సుగా పవన్ కళ్యాణ్‌ని విమర్శించడానికి వాళ్ళ దగ్గర సరైన పాయింటే వుండదు. అదీ పవన్ కళ్యాణ్ ప్రత్యేకత. పబ్లిసిటీకి దూరంగా, పవన్ కళ్యాణ్ చేసే సేవా కార్యక్రమాలుంటాయి.
సాయం చేయడం.. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం (Pawan Kalyan The Power King)
సాయం పొందిన వ్యక్తులు.. ఎప్పుడో ఒకప్పుడు, ఆ సాయం గురించి చెబితే తప్ప, పవన్ కళ్యాణ్ ఇలా సాయం చేశాడట.. అన్న విషయం బయటకు పొక్కదు. ఇలాంటి సంఘటనలు ఒకటా.? రెండా.? పదా? పాతికా.? లెక్కలేనన్ని కన్పిస్తాయి.
సినీ జీవితం తనకు చాలా ఇచ్చింది.. మరి, ప్రజల కోసం ఏం చేయగలను.? అన్న ఆలోచనతోనే రాజకీయాల్లో తొలి అడుగు అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో పడింది. కొన్ని కారణాలతో, కొన్నాళ్ళపాటు రాజకీయాలకు దూరమవ్వాల్సి వచ్చింది. ఈసారి, జనసేన పార్టీతో జనంలోకి వచ్చారు పవన్ కళ్యాణ్.
పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా, ‘పార్టీకి పడ్డ ఆ కొన్ని ఓట్లు కూడా మార్పుకి సంకేతమే. మార్పు నెమ్మదిగా మొదలవుతుంది.. కానీ, ఆ మార్పు చాలా బలంగా నాటుకుపోతుంది’ అని నమ్మే వ్యక్తి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan The Power King). గెలవడమంటే.. ఎవర్నో ఓడించడం కాదు.. వ్యవస్థలో మార్పుని తీసుకురావడమనే భావనతో జనసేన పార్టీని.. ఆ జనం కోసమే నడుపుతున్నారు.
జనం కోసం జనసేనాని
అందుకే, తమకు సమస్య వస్తే.. ఆ జనం తొలుత జనసేన పార్టీ (Jana Sena Party) తలుపు తడుతున్నారు. మార్పు కోసం జనసేన.. అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ‘పవర్’ ఆయన పేరులోనే వుంది. ఆ పవర్ ఇప్పుడు ప్రజా సేవ కోసం ఉపయోగపడుతుంది.
అధికారం చేజిక్కించుకోవడమంటారా.? తాను కోరుకున్న మార్పుని సాధిస్తే.. అది అధికార పీఠమెక్కడం కంటే ఎక్కువ ‘కిక్కు’ ఇస్తుంది. ఆ కిక్కునే కోరుకుంటున్నారు జనసేనాని. దటీజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. Happy Birthday Power Star Pawan Kalyan.