బిగ్‌బాస్ రియాల్టీ షో గేమ్ ఫార్మాటే అంత. ఎవరూ ‘క్లీన్’ ఇమేజ్‌తో బయటకు వచ్చే పరిస్థితి దాదాపుగా వుండదు. ‘సేఫ్ గేవ్‌ు’ ఆడే క్రమంలో అందరూ మంచివాళ్ళమేననిపించుకోవాలంఓటే అస్సలు కుదరదు. హోస్ట్ అంటే, ‘నారదుడు’ చేసే పనులు చెయ్యాల్సిందే.. అంటే, పుల్లలు పెట్టడం అన్నమాట.
హోస్ట్ నాగార్జున మాత్రం ఏం చేయగలడు.? ఆ గేవ్‌ు అలా డిజైన్ చేయబడింది. ‘జీరో – హీరో’ అనే టాస్క్ తీసుకొచ్చారు సెకెండ్ వీకెండ్లో. ఈ క్రమంలో బోల్డంత డ్రామా పండింది. గొడవలు రేగాయి. అప్పటిదాకా అలా అలా సర్దుకుపోయిన కంటెస్టెంట్స్‌లో కొందరు చెలరేగిపోయారు.
ఏడుపులు, పెడబొబ్బలు.. అహహా.. కాస్సేపు ఇది రియాల్టీ షో అన్న విషయాన్ని బిగ్‌బాస్ ప్రేక్షకులు మర్చిపోవాల్సి వచ్చింది. ‘అమ్మ’ రాజశేఖర్ ఏడవడమేంటి.? సినిమా కెరీర్లో ఇతరుల్ని శాసించడం తప్ప.. ఆయనెప్పుడూ ఎవరి కారణంగానూ విమర్శలు ఎదుర్కోలేదు. అసలాయన్ని ఎవరూ ‘బ్యాడ్’ అని అనలేదిప్పటిదాకా.
అలాంటి అమ్మ రాజశేఖర్‌ని లాస్య, దేవి.. మెడపట్టుకుని బయటకు గెంటేశారు. దాంతో, అమ్మ రాజశేఖర్ ఆ పరాభవాన్ని జీర్ణించుకోలేకపోయారు. మోకాళ్ళ మీద నిల్చుని ప్రాధేయపడ్డాడు.. బుల్లితెర వీక్షకులకు క్షమాపణ చెప్పాడు. ఇక, ఈ హౌస్‌లో వుండలేనంటూ మొరపెట్టుకున్నాడు. ఎంత దారుణమైన పరిస్థితి ఇది.
హౌస్‌లో ఓ టాస్క్ సందర్భంగా అమ్మ రాజశేఖర్ ఓ డైరెక్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గా చేసిన ఓ ‘పని’ లాస్యకు అసభ్యకరంగా అనిపించింది. దేవికి అయితే, అమ్మ రాజశేఖర్ గ్రూపులు నడుపుతున్నాడనిపించింది. దేవి విషయం పక్కన పెడితే, లాస్య ఆరోపణ మాత్రం జుగుప్సాకరం.
అందుకే అమ్మ రాజశేఖర్ అంతలా హర్టయ్యాడు. ఎంతమంది హీరోయిన్లను తన కెరీర్లో అమ్మ రాజశేఖర్ చూసి వుంటాడు. ఎందరి మన్ననల్ని అందుకుని వుంటాడు? కనీస ఇంగితం లేకుండా లాస్య ఆ కాస్సేపు ప్రవర్తించింది. అది ఆమెకీ తెలుసు.
అసలు ఈ మొత్తం వ్యవహారానికి కారణం కింగ్ నాగ్ ఇచ్చిన ‘జీరో – హీరో’ టాస్క్. హౌస్‌లో గొడవలు షురూ అయ్యాయ్. ఇక్కడితో ఆగిపోతాయా.? అంటే, ఆగిపోవచ్చు కూడా. లేదంటే, చివరి వరకూ కొనసాగొచ్చు.
చాలామంది నాగార్జునని ఆడిపోసుకుంటున్నారు.. కానీ, ఆయన జస్ట్ హోస్ట్ అంతే. బిగ్‌బాస్ కాన్సెప్టే అలా తగలబడింది.. కింగ్ నాగ్ మాత్రం ఏం చేయగలడు.? బిగ్‌హౌస్‌లోకి వెళితే, రెస్పెక్ట్ పోగొట్టుకోవాల్సిందేనని అమ్మ రాజశేఖర్ ఎపిసోడ్ ఇంకోసారి నిరూపించింది.