‘చావు కబురు చల్లగా’ (Chaavu Kaburu Challaga) అనే చిత్ర విచిత్రమైన టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చేయడానికి సిద్ధమవుతున్నాడు బస్తీ బాలరాజు అలియాస్ కార్తికేయ (Kartikeya Gummakonda).
‘ఆర్‌ఎక్స్ 100’ (Rx 100) సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కార్తికేయ, ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. హీరోగా మాత్రమే కాదు, ఛాన్సొస్తే విలన్‌గానూ సత్తా చాటుతానని ‘నాని గ్యాంగ్ లీడర్’ సినిమాతో నిరూపించిన విషయం విదితమే.
ఈసారి ఇంకాస్త భిన్నంగా ‘చావు కబురు చల్లగా’ అంటూ ఆడియన్స్‌ని ఓ రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేసేస్తానంటున్నాడు. కార్తికేయ పుట్టినరోజు నేపథ్యంలో ‘చావు కబురు చల్లగా’ టీవ్‌ు ఓ ‘గ్లింప్స్’ని విడుదల చేసింది. ఇందులో మనోడి క్యారెక్టర్‌ని పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ చేసేశారు.
పార్దీవ దేహాల్ని తరలించే ఏసీ వ్యాన్‌ని నడుపుతుంటాడు బస్తీ బాలరాజు. చావులు చూసీ చూసీ ఏడుపంటే చిరాకు పడే బస్తీ బాలరాజుకి, ఓ అమ్మాయి ఏడుపు మాత్రం బాగా నచ్చేసిందట.
ఎవరా అమ్మాయి.? ఏమా కథ.? అన్నది మాత్రం తెరపై చూడాల్సిందే. గ్లింప్స్‌లో కమెడియన్ బ్రహ్మం, సీనియర్ నటి ఆమని కన్పించారు. ఆన్ స్క్రీన్ ఎనర్జీ విషయంలో కార్తికేయ సినిమా సినిమాకీ మరింతగా చెలరేగిపోతున్నాడు.
ఈ ’చావు కబురు చల్లగా‘ సినిమాతో అయితే పీక్స్‌లో తన ఎనర్జీని చూపించబోతున్నట్లే కనిపిస్తోంది. లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఈ సినిమాలో కార్తికేయ సరసన హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం విదితమే.
తొలి గ్లింప్స్‌తోనే అందరి దృష్టినీ తనవైపుకు తిప్పేసుకున్న కార్తికేయ, ఇక పూర్తి సినిమాలో ఇంకెంతలా చెలరేగిపోయాడో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.