అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నిశ్శబ్దం’ (Nishabdham) కొన్ని అనివార్య కారణాలతో నిర్మాణం కోసం ఎక్కువ సమయమే తీసుకోవాల్సి వచ్చింది. విడుదలకు సిద్ధమవుతోందనుకున్న వేళ కరోనా లాక్‌డౌన్ వచ్చిపడింది. దాంతో, సినిమాని ఓటీటీలో (Anushka Shetty Nishabdham) విడుదల చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
సినిమా టెక్నికల్‌గా అత్యద్భుతంగా నిర్మించిన దరిమిలా, ఓటీటీలో రిలీజ్ చేసేందుకు తొలుత సంసిద్ధత వ్యక్తం చేయని ‘నిశ్శబ్దం’ టీమ్, చివరికి ఓటీటీ వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. అనుష్క ఈ సినిమాలో ‘మ్యూట్ ఆర్టిస్ట్’గా కన్పించబోతోంది. ఆమె మాట్లాడలేదు.
కానీ, అవతలి వ్యక్తి లిప్ సింక్‌ని బట్టి మాత్రమే అవతలి వ్యక్తి మాట్లాది అర్థమవుతుందామెకి. సైగల ద్వారా తాను చెప్పాలనుకున్నది చెబుతుంటుంది. టీజర్‌తోనే సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ట్రైలర్ వచ్చాక ఆ అంచనాలు మరింతగా పెరిగాయనడం నిస్సందేహం.
టెక్నికల్‌గా సినిమా చాలా సౌండింగ్‌తో వున్నట్లే కనిపిస్తోంది. ఫన్ కూడా ఎక్కడా మిస్ కాలేదని కొన్ని సీన్స్‌ని బట్టి అర్థమవుతోంది. ‘మీరెప్పుడైనా గోస్ట్‌ని చూశారా.? అని అంజలి (Anjali) ఓ పోలీస్ అధికారిని అడిగితే, చూశాను.. నా మాజీ భార్య రూపంలో’ అంటాడతడు.
ఇక, అనుష్క నటన పరంగా అత్యద్భుతంగానే చేసినట్లు కనిపిస్తోంది. మాధవన్ (Madhavan) స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి అదనపు ఆకర్షణ అయ్యేలా వుంది. ఈ సినిమాలో ‘అర్జున్ రెడ్డి’ ఫేం షాలిని పాండే (Shalini Pandey) మరో కీలక పాత్రలో నటిస్తోంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా కుదిరినట్లే కనిపిస్తోంది ట్రైలర్ చూస్తే.
గతంలో అనుష్క ‘భాగమతి’ అనే ద్రి¸ల్లర్ సినిమా చేసినా, అంతకు మించిన పవర్ ఇందులో అనుష్క ప్రదర్శించిందనే భావన ట్రైలర్‌తో కలుగుతుంది ప్రతి ఒక్కరికి. మాట్లాడలేని, అవతలి వ్యక్తి మాటల్ని వినలేని ఓ యువతి చుట్టూ సాగే కథ ఇది. ఇలాంటి పాత్రలో అనుష్క.. ఎంత ఛాలెంజింగ్ ఆ పాత్రని తీసుకుని సత్తా చాటిందో వేచి చూడాల్సిందే.