కెప్టెన్సీ టాస్క్ కోసం ‘బురదలో కాయిన్స్ వెతికే’ (Bigg Boss Telugu 4 Muddy Game) కాన్సెప్ట్‌ని బిగ్‌బాస్, కంటెస్టెంట్స్‌కి ఇచ్చాడు. ఈ పోటీలో నలుగురు తలపడ్డారు. ఏంటీ, ఇది పాత సీజన్ల వ్యవహారం అనిపిస్తోంది కదూ.! అవును, అదే.. చిన్న చిన్న మార్పులతో రిపీట్ అయ్యింది.
సుజాత, అమ్మ రాజశేఖర్, కుమార్ సాయి, అలేఖ్య హారిక ‘బురదలో’ పొర్లాడి కెప్టెన్సీ టైటిల్ కోసం పోరాడారు. అందులో కుమార్ సాయి గెలిచాడు. సో, వచ్చేవారం నామినేషన్స్ నుంచి కుమార్ సాయి సేఫ్ అన్న మాట. మరి, రేపే వికెట్ పడిపోతేనో.! ఏమో, చెప్పలేం.
ప్రస్తుతానికైతే కుమార్ సాయి ఓట్ల పరంగా సేఫ్ జోన్లోనే కనిపిస్తున్నాడు. అయితే, బిగ్‌బాస్‌లో ఏదైనా జరగొచ్చు. ఇక్కడ ఓట్లతో సంబంధం లేకుండా వికెట్లు పడిపోతాయనే బలమైన నమ్మకం బిగ్‌బాస్ వ్యూయర్స్లోనూ కనిపిస్తోంది.
ఇదిలా వుంటే, ఈ ‘మడ్ టాస్క్’ కోసం ఎంపికైన ఆ నలుగురూ నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఈ రేసులోకి వచ్చారు. అదో పెద్ద గందరగోళం మళ్ళీ. మెహబూబ్ అత్యధిక పాయింట్లు కలిగి వున్నాడుగానీ, తింగరి ఆలోచన చేసి ఆ పాయింట్లను సుజాతకి ఇచ్చేశాడు. కంటెస్టెంట్స్‌లో చాలామందికి దెబ్బలు తగిలాయి కాయిన్స్ టాస్క్‌లో.
ఇంతా కష్టపడి, చివరికి మడ్ టాస్క్ వచ్చేసరికి.. మిగతా కంటెస్టెంట్స్ అంతా ప్రేక్షకుల్లా మారిపోయారు. బిగ్‌బాస్ ఏం చెబుతున్నాడో, హౌస్మేట్స్ ఏం చేస్తున్నారో.. ఇదంతా చూసే బిగ్‌బాస్ వ్యూయర్స్‌కి మాత్రం అస్సలేమీ అర్థం కావడంలేదు. కాస్సేపు తిట్టుకుంటారు, అంతలోనే కలిసిపోతారు.
‘తిట్టుకున్నాం కదా.. ఈ తిట్ల టాస్క్ అయిపోయింది..’ అన్నట్టు వ్యవహరిస్తున్నారు తప్ప, అస్సలు సీరియస్‌నెస్ వుండడంలేదు కంటెస్టెంట్స్ మధ్య. ఏ ఎమోషన్‌నీ కాస్సేపు కూడా క్యారీ చెయ్యట్లేదు. జస్ట్ అంతా స్క్రిప్టెడ్.. అన్నట్లే సీన్స్ అన్నీ నడుస్తున్నాయి. టాస్క్లదీ అదే పరిస్థితి.
ప్రోమోలతో సస్పెన్స్ క్రియేట్ చేయడం, తీరా ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేసరికి… ఆ సీరియస్‌నెస్ ఏమీ అందులో లేకపోవడం.. పరమ రొటీన్ వ్యవహారంగా మారిపోయింది. నోయెల్ సీన్ అయితే ఈ వారం కంప్లీట్‌గా డల్ మోడ్‌లో వున్నాడు.
నిజానికి, ఈ సీజన్లో చాలామంది టాలెంటెడ్ కంటెస్టెంట్స్ వున్నారు. వాళ్ళందర్నీ సరిగ్గా వాడితే.. షో ఇంకో రేంజ్లో వుంటుంది. కానీ, వాళ్ళ టాలెంట్ అంతా బురదపాలైపోతోంది.