టాస్క్ పేరు ‘మంచి మనుషులు – కొంటె రాక్షసులు’ (Bigg Boss Telugu 4 Tasks) . కానీ, ఇక్కడ సీన్ ఇంకోలా వుంది. రాక్షసుల్లో కొంటెతనమేంటి కామెడీ కాకపోతే.! అందుకేనేమో, రాక్షసులంతా పిచ్చి పిచ్చిగా వ్యవహరించారు. ఔను, ‘పిచ్చి రాక్షసులు’ అనడం కరెక్ట్. ఎందుకంటే, హౌస్‌ని అంత పిచ్చి పిచ్చిగా మార్చేశారు.
విజయదశమి నేపథ్యంలో ఓ అద్భుతమైన టాస్క్‌ని డిజైన్ చేశారు బిగ్‌బాస్ సీజన్ 4 కోసం. కానీ, ఏం లాభం.? ‘కొంటె రాక్షసులు’ అన్న బిగ్‌బాస్ సూచన, ఆ కేటగిరీలో సెలక్ట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరికీ అర్థం కాలేదు. కొంటెతనమంటే, సరదా సరదా పనులు చేస్తూ.. అల్లరి చేయాలి.
Also Read: హారికని గెలిపించి, తానూ గెలిచిన అబిజీత్
కానీ, ఇక్కడ పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయారు కంటెస్టెంట్స్. అరియానా గ్లోరీ, అవినాష్, మెహబూబ్, అలేఖ్య హారిక, అఖిల్.. ఇదీ పిచ్చి రాక్షసులు.. అదేనండీ కొంటె రాక్షసులు. వీళ్ళలో అఖిల్‌కి పిచ్చితనం ప్రదర్శించడం రాలేదు. మిగతా నలుగురు మాత్రం ‘పిచ్చి పీక్స్’ అనే స్థాయిలో ‘అతి’ చేసేశారు.
నలుగురిలో ఎవరూ తక్కువ కాదు.. ఒకర్ని మించి ఇంకొకరు ‘అతి పిచ్చి’ ప్రదర్శించి బిగ్‌బాస్ వ్యూయర్స్ సహనాన్ని పరీక్షించారు. ఈ పిచ్చి ఇలా తగ్గదనుకున్నారో ఏమోగానీ, నిర్వాహకులు కొన్ని వెసులుబాట్లను మనుషులకి కల్పించారు. అలా పిచ్చి రాక్షసుల సంఖ్య తగ్గుతూ వస్తుంటుందన్నమాట.
Also Read: దివి, అరియానా, అవినాష్.. సూపర్ పవర్.!
ఆ తగ్గే క్రమంలో తొలుత అఖిల్ మనిషిలా మారాడు. ఆ తర్వాత వంతు అలేఖ్య హారికది. ఎందుకు ఏడ్చిందో తనకే తెలియదన్నట్టు మనిషిగా మారే క్రమంలో ‘ఓవరాక్షన్ ఏడుపు’ ప్రదర్శించింది. మెహబూబ్‌ని మార్చాలని ‘మంచి మనుషులు’ బృందం అనుకున్నారుగానీ, చివరి నిమిషంలో తనను మంచి మనిషిగా మార్చారన్నది హారిక బాధ.
దేవుడా.. ఈ టాస్క్‌లేంటి.. వాటిల్లో కంటెస్టెంట్ల పిచ్చితనమేంటి.. పైగా, ఇదంతా ఓ పిచ్చి ఆట అని తెలిసీ, ఆ ఆటలో మళ్ళీ ‘తొండి’ అంటూ, ఈ అర్థం పర్థం లేని ఏడుపుల గోలేంటి.? బిగ్‌బాస్ రియాల్టీ షోకి వున్న ఇమేజ్‌ని పూర్తిగా పాతాళానికి తొక్కేయాలనే ఈ ప్రయత్నమా? అన్న సందేహాలైతే బిగ్‌బాస్ వ్యూయర్స్‌కి కలుగుతున్నాయ్ మరి.