ఫర్నిచర్ దొంగతనమా.? కోడెలకైనా.. జగన్‌కైనా ఏంటా ఖర్మ.?

 ఫర్నిచర్ దొంగతనమా.? కోడెలకైనా.. జగన్‌కైనా ఏంటా ఖర్మ.?

YS Jagan Mohan Reddy

Andhra Pradesh Furniture Thief.. కోట్లకి పడగలెత్తిన నాయకులు వీళ్ళు.! వీళ్ళకి లక్షలు విలువ చేసే ఫర్నిచర్‌ని దొంగతనం చేయాల్సిన ఖర్మ ఏంటి.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసలేం జరుగుతోంది.? అసత్య ప్రచారం.! ఫేక్ న్యూస్.! ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో దిగజారుడుతనం మరీ దారుణంగా తయారైంది.

అప్పట్లో.. అంటే, కోడెల శివప్రసాద్ మీద ‘ఫర్నిచర్ దొంగతనం’ ఆరోపణలు వచ్చినప్పుడు, వైసీపీ చేసిన ‘అతి’ అంతా ఇంతా కాదు.!

వైసీపీ, ఆ పార్టీ కనుసన్నల్లో నడిచే ‘నీలి కూలి’ మీడియా, కోడెల శివప్రసాద్ మీద చేసిన దుష్ప్రచారం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

Andhra Pradesh Furniture Thief.. ప్రాణం తీసిన ఆరోపణ..

కోడెల శివప్రసాద్ ఏంటి.? ఫర్నిచర్ దొంగతనం చేయడమేంటి.? అన్న ఇంగితం కూడా లేకుండా, వేధింపులకు గురిచేసింది వైసీపీ. సూటిపోటి మాటలతో, కోడెల శివప్రసాద్‌ని అవమానించింది.

ఫలితం, కోడెల శివప్రసాద్ బలవన్మరణం.

ఆ ఘటన ఆ కుటుంబానికి ఎంత క్షోభ మిగిల్చిందో ఊహించుకుంటేనే ఒళ్ళు గగుర్పాటుకి గురవుతుంది. ప్చ్.. ఏమీ మారలేదు.! మళ్ళీ అదే తంతు.

Kodela Siva Prasad Andhra Pradesh Furniture
Kodela Siva Prasad Andhra Pradesh

కాకపోతే, ఈసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ‘ఫర్నిచర్ దొంగ’ అనే ఆరోపణలు. ఈసారి ఆరోపణలు చేస్తున్నది తెలుగు దేశం పార్టీ.

స్పీకర్ పదవిలో వుండి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నది కోడెల శివప్రసాద్ మీద వచ్చిన ఆరోపణ అయితే, ముఖ్యమంత్రి హోదాలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నది వైఎస్ జగన్ మీద వస్తున్న ఆరోపణ.

వైఎస్ జగన్‌కి ఆ ఖర్మ పట్టిందా.?

ఫర్నిచర్ విషయంలో కోడెల శివప్రసాద్ అయినా, వైఎస్ జగన్ అయినా, ‘దొంగతనం’ చేసే పరిస్థితే వుండదు. ‘లేకితనం’ ప్రదర్శించే అవకాశం అస్సలు వుండదు.

వైసీపీ తన రాజకీయ అవసరాల కోసం కోడెల శివప్రసాద్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేసిన దరిమిలా, ఆ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద టీడీపీ ఇప్పుడు ‘రివెంజ్’ తీర్చుకుంటోందంతే.!

Also Read: అల్లు అర్జున్ ఆర్మీ దెబ్బకి పారిపోయిన నాగబాబు.?

తప్పదు.. చేసిన పాపం వైఎస్ జగన్ అనుభవించాల్సిందేనేమో.!

ఇంతకీ వ్యవహారం, ఆరోపణలకే పరిమితమవుతుందా.? వివాదం ముదిరి పాకాన పడి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్టు దాకా వెళుతుందా.? వేచి చూడాల్సిందే.

Digiqole Ad

Related post