ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. అంటూ అబిజీత్, మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్ (Abijeet Monal Gajjar Akhil Sarthak Patch Up) చుట్టూ పెద్ద కథ అల్లేశాడు బిగ్‌బాస్. ‘మా మధ్య ఏమీ లేదు..’ అని ముగ్గురూ విడివిడిగా, కలివిడిగా చెబుతున్నా, మేటర్ ఏదో వుందంటూ బిగ్ హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా తనవంతు ‘పులిహోర’ కలపడంలో బిజీగా వున్నాడు.
ఇక, ఇలా కాదనుకున్నారో ఏమో.. ముగ్గురూ కలిసి ఒకే చోట కూర్చుని ఇష్యూస్ సార్ట్ ఔట్ చేసేసుకున్నారు.. ఆ ముగ్గురూ ఎవరో కాదు అబిజీత్, అఖిల్, మోనాల్. ఈ ముగ్గురూ ఇంత ప్లెజెంట్‌గా ఒకేచోట కూర్చుని మాట్లాడుకోవడం ఆశ్చర్యకరమే. అబిజీత్ ఎప్పటిలానే తన పాయింట్ తాను గట్టిగా చెప్పేశాడు.
ఈసారి కాస్త కొత్తదనమేంటంటే, మోనాల్ గజ్జర్ ఏడవకుండా అబిజీత్ చెప్పిన పాయింట్‌ని వినడమే కాదు, అతనిలో ఏకీభవించింది కూడా. ఇంతలోనే అఖిల్ వచ్చాడు అక్కడికి. అఖిల్ రాకతో సీన్ మారిపోతుందేమోనన్న అనుమానం చాలామందికి కలిగింది.
కానీ, అఖిల్ వచ్చాక కూడా ఇష్యూ కూల్‌గానే నడిచింది. అబిజీత్‌ని అఖిల్ సమర్థించాడు, మోనాల్‌ని కూడా సమర్థించాడు. మొత్తంగా చూస్తే, ఇక్కడ ఈ ఎపిసోడ్‌లో అబిజీత్‌తో గొడవ అనవసరం అనుకుని అఖిల్, మోనాల్ గజ్జర్ ఓ గట్టి నిర్ణయానికి వచ్చి మరీ అబిజీత్‌తో డిస్కషన్ చేశారేమో అనిపించింది.
ఎలాగైతేనేం, డిస్కషన్ తర్వాత కూడా మోనాల్ గజ్జర్ హ్యాపీగానే కనిపించింది. ఇక్కడిదాకా బాగానే వుందిగానీ, రేపటి వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున మళ్ళీ కొత్త పులిహోర కలిపేసి, ఈ ముగ్గుర్నీ విడగొట్టేయడు కదా.? అన్న అనుమానాలైతే చాలామందిలో వున్నాయి.
ఎంతలా ఇష్యూని అబిజీత్ సార్ట్ ఔట్ చేసుకోవాలనుకున్నా, ఇటు మోనాల్‌నిగానీ.. అటు అఖిల్‌నిగానీ నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే, మొదటి నుంచీ ఈ ఇద్దరూ పూర్తి కన్‌ఫ్యూజన్‌తో వున్నారు.. అదే కన్‌ఫ్యూజన్‌ని కొనసాగిస్తున్నారు.
అబిజీత్ మీద మోనాల్, అఖిల్ అభిమానుల్లో కొంత నెగెటివిటీ వుంటే, అదిప్పుడు కాస్త తగ్గుతుందని అనుకోవచ్చు.. అదొక్కటే నేటి ఎపిసోడ్‌తో అబిజీత్‌కి కలిగిన కాస్త లాభం (Abijeet Monal Gajjar Akhil Sarthak Patch Up) అనుకోవాలేమో.