‘నా వరకు నేనే స్ట్రాంగ్.. నా కంటే స్ట్రాంగ్ ఇంకెవరో వున్నారని నేను అనుకోలేదు. మొదట ఈ బిగ్ హౌస్‌లోకి వచ్చేటప్పుడు, గెలవాలనుకోలేదు.. ఎక్స్‌పీరియన్స్ కోసం వచ్చాను. రాను రాను షోలో నేనూ గెలవడం కోసమే వచ్చాననే విషయాన్ని అర్థం చేసుకున్నాను..’ అంటూ చెప్పాలనుకున్న విషయాన్ని కుండబద్దలుగొట్టేశాడు అబిజీత్ (Abijeet Vs Akhil Sarthak).
స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని బయటకు పంపించేందుకు కంటెస్టెంట్స్‌కి బిగ్ బాస్ పరీక్ష పెడితే, ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడారు. లాస్య, హారిక, అబిజీత్ మాత్రమే.. ఈ విషయంలో ఖచ్చితమైన అభిప్రాయంతో వున్నారు.
Also Read: సీక్రెట్ రూంలో అఖిల్.. అసలు స్కెచ్ అదేనా.?
‘నేను గెలవడం కోసం, నా స్నేహితుడ్ని ఓడిపోమని చెప్పలేను..’ అని హారిక చెప్పిందీ వ్యాలీడ్ పాయింట్. లాస్య కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అబిజీత్ అయితే, మొత్తం హౌస్ మేట్స్ అంతా వచ్చి, అఖిల్ సార్థక్ పేరు చెప్పాలని పట్టుబట్టినా, ససేమిరా అన్నాడు.
‘నేను డిసైడ్ అయ్యాను. నా నిర్ణయం నేను మార్చుకోలేను. మీరంతా ఒకే పేరు చెప్పినా, నా పేరు మాత్రమే నేను చెప్పుకుంటాను..’ అని తేల్చేశాడు. ‘అలా కుదరదు, ఏకాభిప్రాయం తప్పదు..’ అని సోహెల్, మెహబూబ్, అవినాష్ చెప్పినా కన్విన్స్ అవలేదు అబిజీత్.
‘నేను ప్రకటించేస్తాను, నువ్వు సైలెంట్‌గా వుండు..’ అని సోహెల్ చెబితే, అప్పుడు కూడా అబిజీత్ అన్యమనస్కంగానే ‘ఊ’ అన్నాడు తప్ప, అది కూడా మనస్ఫూర్తిగా కాదు. ఎక్కడో అబిజీత్‌కి, అఖిల్ తిరిగొస్తాడనే గట్టి నమ్మకంతోపాటు, అఖిల్ వినాలనే కొన్ని మాటలు కూడా చెప్పాడు.
వాటి పట్ల అఖిల్ సీక్రెట్ రూం నుంచి వెటకారం చేస్తే, ‘బహుశా ఇవన్నీ నువ్వు చూస్తావేమో.. నువ్వు వచ్చాక, వీటి గురించి నీతో మాట్లాడాలి..’ అని అబిజీత్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ ఎపిసోడ్‌తో అబిజీత్ (Abijeet Vs Akhil Sarthak) తన ఇమేజ్‌ని మరింత పెంచుకున్నట్లయ్యింది.