కరోనా గిరోనా జాన్తా నై.. సినిమా మేనియా షురూ అయ్యిందిప్పుడు. థియేటర్లలో సినిమాలు (KRACKing Sankranthi On The Way) చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా వున్నారు. వారిని అలరించేందుకు సినిమాలూ పోటీ పడుతున్నాయి. ‘సోలో బ్రతుకే సో బెటర్’తో మంచి బోణీ పడింది టాలీవుడ్‌కి.
ఇంకేముంది.? సినిమాలు క్యూ కట్టేస్తున్నాయ్ సంక్రాంతి సీజన్‌లో సత్తా చాటెయ్యడానికి. ఈ లిస్ట్‌లో మాస్.. ఊర మాస్.. అంటున్నాడు మాస్ మహరాజ్ రవితేజ. ‘క్రాక్’ సినిమాతో రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ సంక్రాంతికి మాస్ పవర్ చూపించబోతున్నాడు.
తాజాగా ‘క్రాక్’ టీమ్, ఈ సినిమా ట్రైలర్‌ని నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ జనవరి 1న విడుదల చేసింది. రవితేజ సినిమా నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో, అన్నీ వున్నాయ్ సినిమాలో. ‘శంకర్.. పోతరాజు వీర శంకర్.. ష్యూర్ షాట్.. నో డౌట్.. పుచ్చె పేలిపోద్ది..’ అంటూ రవితేజ బీభత్సమైన ఎనర్జీతో చెప్పిన డైలాగ్ ఈ టీజర్‌కే హైలైట్. యాక్షన్ ఎపిసోడ్స్ బీభత్సహ అనేలా వున్నాయి.
‘చూశారా.. జేబులో వుండాల్సిన నోటు.. చెట్టుకు ఉండాల్సిన కాయ.. గోడకు ఉండాల్సిన మేకు.. ఈ మూడూ ముగ్గురు తోపుల్ని తొక్కి తాట తీశాయ్. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే, ఈ ముగ్గురితో ఆడుకుంది ఒకే పోలీసోడు’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమయ్యింది.
విక్టరీ వెంకటేష్ ఈ డైలాగ్ చెబుతూ వాయిస్ ఓవర్ ఇచ్చాడరు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్ నెగెటివ్ రోల్‌లో కన్పించబోతోంది.
తమన్ ఈ చిత్రానికి (KRACKing Sankranthi On The Way) సంగీతం అందిస్తున్న విషయం విదితమే. మాస్.. మాస్ కా బాప్.. అనేలా ట్రైలర్ రూపొందింది. సో, సినిమాలో డబుల్ మాస్.. కాదు కాదు, అంతకు మించి మాస్ కంటెంట్‌ని చూడబోతున్నామన్నమాట. ఇవే, ఇలాంటి సినిమాలే.. ఈసారి సంక్రాంతికి పడాలి.. అప్పుడే థియేటర్లు హోరెత్తిపోతాయ్.