పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గేర్ (Pawan Kalyan New Change In Politics And Movies) మార్చారు.. అటు రాజకీయాల పరంగానూ, ఇటు సినిమాల పరంగానూ. పంచాయితీ ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావమెంత.? అన్నదాని గురించి రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రధాన మీడియా సంస్థలూ గట్టిగానే మాట్లాడుకుంటున్నాయి.
తొలుత ‘జీరో’ అన్నవారే, ఇప్పుడు ‘హీరో’ అంటూ జనసేన పార్టీ (Jana Sena Party Chief Pawan Kalyan) గురించి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించీ చర్చించుకుంటుండడం గమనార్హం. ఇంకోపక్క సినిమాల పరంగా కూడా జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ ‘న్యూ పవర్’ చూపించబోతున్నారట.
తన కొత్త సినిమాల కోసం అనూహ్యంగా ఓ ఆసక్తకిరమైన నిర్ణయం పవన్ తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. పవన్ (Janasenani Pawan Kalyan) ఎప్పుడూ ఫిట్‌గానే వుంటారు. కానీ, రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా వుండడంతో ఒకింత ఫిట్‌నెస్ మీద శ్రద్ధ తగ్గిందాయనకి.
దాంతో, వున్నపళంగా ఆయన ఫిట్‌నెస్ మీద దృష్టి పెట్టాల్సి వచ్చిందనీ, కొద్ది రోజుల్లోనూ మళ్ళీ పవన్ కళ్యాణ్‌ని (Vakeel Saab Pawan Kalyan) స్లిమ్ అండ్ ఫిట్ లుక్‌లో చూడబోతున్నామనీ తెలుస్తోంది. చేతిలో చాలా సినిమాలున్నాయిప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నవీ, చేయబోతున్నవీ లెక్కేసుకుంటే.
అసలు ఆయా సినిమాల షూటింగులు ఎప్పుడు జరుగుతున్నాయో కూడా ఎవరికీ తెలియడంలేదు. అంత పక్కా ప్లానింగ్‌తో జరుగుతున్నాయవి. సినిమాల్లో బిజీగా వుంటూనే, పార్టీ కోసం సమయం కేటాయిస్తున్నారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan New Change In Politics And Movies).
పంచాయితీ ఎన్నికల సందర్భంగా గ్రామ స్థాయిలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు జనసేన అధినేత తెలుసుకుంటున్నారు. జనసైనికుల్ని ఎక్కవగా ఎన్నికల్లో పోటీకి నిలబెట్టారు. పార్టల ప్రత్యక్ష ప్రమేయం లేని ఎన్నికలే అయినప్పటికీ, అన్ని పార్టీలూ పంచాయితీ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
తాజా అంచనాల ప్రకారం చూసుకుంటే 18 నుంచి 22 శాతం ఓటు బ్యాంకుని జనసేన (Pawan Kalyan New Change In Politics And Movies) కొల్లగొట్టిందంటే, ఇదొక విప్లవాత్మకమైన మార్పుగానే భావించాల్సి వుంటుంది రాష్ట్ర రాజకీయాల్లో.
త్వరలో మునిసిపల్ ఎన్నికలు పార్టీల పరంగా జరిగే అవకాశం వున్నందున, ఇదే ఓటు బ్యాంకు కొనసాగిస్తే మాత్రం, జనసేన ఆశ్చర్యకరమైన ఫలితాలు సొంతం చేసుకోవచ్చు.