‘ఉప్పెన’ (Uppena Super Sensational Hit) సినిమాలో కంటెంట్ ఏంటో తెలియదు.. కానీ, సినిమా మీద దుష్ప్రచారం మొదలైంది. ఎందుకంటే, హీరో మెగా కాంపౌండ్ నుంచి వచ్చాడు గనుక. సినిమాకి సంబంధించిన ‘టాప్ సీక్రెట్’ ఎప్పుడో లీక్ అయిపోయింది. అది నిజమేనా.? కాదా.? అన్నదానిపై సినిమా విడుదలయ్యేదాకా సస్పెన్స్ కొనసాగింది.
నిజానికి, కథ విన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా కొంత ఆలోచనలో పడిపోయారు. కానీ, ప్రోత్సహించారు చిరంజీవి (Mega Star Chiranjeevi), దర్శకుడిని. అలా ‘ఉప్పెన’ సినిమాకి లైన్ క్లియర్ అయ్యింది. తొలి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ ఇలాంటి రిస్కీ అటెంప్ట్ చేశాడంటే, అతన్ని మెచ్చుకుని తీరాల్సిందే.
దర్శకుడు, నటీనటులు, నిర్మాత.. ఇలా అందరూ పెద్ద రిస్కే చేశారు. మంచి ఫలితాన్ని సాధించారు కూడా. సినిమా (Uppena Super Sensational Hit) రేపు విడుదలవుతుందనగా, సోషల్ మీడియాలో ‘నెగెటివిటీ’ అనూహ్యంగా పెరిగిపోయింది. కీలకమైన సన్నివేశాన్ని లీక్ చేసి పడేశారు.
దారుణమైన మీమ్స్ చిత్ర బృందాన్ని ఇబ్బంది పెట్టాయి. కానీ, ‘ఉప్పెన’ టీమ్, తమ సినిమాపై పూర్తి నమ్మకాన్ని కొనసాగించింది. విడుదలైన రోజు మామూలుగా వున్న టాక్, సాయంత్రానికి మారిపోయింది. మరుసటిరోజుకి ఫలితం ఇంకో స్థాయికి వెళ్ళింది.
వీకెండ్ కదా.. అది మామూలేనని కొంతమంది పెదవి విరిచారు. కానీ, సోమవారం ‘డ్రై డే’ అయినా, బీభత్సమైన వసూళ్ళు వచ్చాయి. సో, ఇక సినిమాని ఆపడం ఎవరి తరమూ కాదని తేలిపోయింది. అయినాగానీ, ‘ఇలాంటి సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ ఎలా ఇస్తారు.?’ అంటూ కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు కొందరు.
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఇలాంటి సినిమా (Uppena Super Sensational Hit) చేయడమేంటి.? హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) చేత అలాంటి డైలాగులు చెప్పడమేంటి.? అంటూ అడ్డగోలు పంచాయితీలు తెరపైకొస్తున్నాయి.
తెలుగు సినిమా గమనం ఎప్పుడో మారిపోయింది. ట్రెండ్‌కి తగ్గట్టుగా.. అంటూ అన్ని హద్దుల్నీ తెంచేసుకుంది తెలుగు సినిమా.
ఈ క్రమంలో తెలుగు సినిమా స్థాయి పెరిగిపోయింది. ఇవన్నీ తెలిసీ.. ‘కోడి గుడ్డు మీద ఈకలు పీకడం’ అనే వ్యవహారం ఎంతవరకు సబబు.? అన్నదే ఇక్కడ కీలకమైన చర్చ.
పంజా వైష్ణవ్ తేజ్ కోరుకుంటే, మాంఛి కమర్షియల్ డైరెక్టర్ చేతిలో పడేవాడు. కానీ, కొత్త దర్శకుడితో.. కొత్త తరహా కథాంశంతో ఎందుకు సినిమా చేసినట్లు.? మెగా కాంపౌండ్.. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అని ఇంకోసారి ‘ఉప్పెన’తో (Uppena Super Sensational Hit) తేలిపోయిందంతే.
హీరోగా తొలి సినిమాతోనే వసూళ్ళ పరంగా రికార్డుల వేట మొదలు పెట్టాడు పంజా వైష్ణవ్ తేజ్. ఓ వైపు ప్రశంసలు, ఇంకో వైపు వసూళ్ళ రికార్డులతో తడిసి ముద్దవుతోంది ‘ఉప్పెన’ టీమ్.
ఈ సందర్భంలో ఇంకా సినిమాని తొక్కేయాలనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? రంధ్రాణ్వేషణకి కూడా ఓ హద్దు వుంటుందనే విషయం సోకాల్డ్ హేటర్స్ ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో.