బరువు పెరగడానికి చాలా కారణాలుంటాయి. కొందరు ఎంత ఎక్కువగా తినేస్తున్నా లావెక్కలేరు. కొందరు తక్కువ తింటున్నా బరువు పెరుగుతుంటారు. బరువు పెరగడం (Obesity & Health Problems) అనే సమస్యకు చాలా కారణాలుంటాయి. ఈ రోజుల్లో తినే తిండి అలాంటిది.
తగినంత శారీరక శ్రమ లేకపోవడం అధిక బరువుకి ప్రధాన కారణంగా వైద్యులు చెబుతుంటారు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలూ బరువు పెరగడానికి కారణమవుతుంటాయి. అదే సమయంలో, బరువు పెరగడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలూ అన్నీ ఇన్నీ కావు. ఒక్కసారి బరువు పెరిగాక, ఆ బరువుని తగ్గించుకోవడానికి పడాల్సిన పాట్లు అన్నీ ఇన్నీ కావు.
బరువు కారణంగా వచ్చే సమస్యల్లో మానసిక సమస్యలు ముఖ్యమైనవి. ‘నేను వాళ్ళలా సన్నగా లేకపోవడం.. నా లోపమే..’ అని చాలామంది బాధపడుతుంటారు. హీరోయిన్ కీర్తి సురేష్ సోదరి రేవతి సురేష్‌ది కూడా ఇదే ఆవేదన. అయితే, ఈ విషయంలో రేవతికి కీర్తి నుంచి పూర్తిస్థాయి మద్దతు లభించింది. ప్రోత్సాహం కూడా లభించింది.

కుటుంబ సభ్యుల అండదండలతో మానసిక సమస్యల నుంచి బయటపడటమే కాదు, దాదాపు 20 కిలోల బరువు కూడా తగ్గానంటున్నారు రేవతి సురేష్.
‘సమాజంలో కొందరుంటారు.. మనల్ని మాటలతో చంపేస్తుంటారు. నేను బరువు పెరిగితే వారికి సమస్య ఏంటి.? నా చెల్లెలితోనూ, నా తల్లితోనూ నన్ను పోల్చి చాలామంది అవమానించారు. ఒక్కోసారి మానసికంగా కుంగిపోయేదాన్ని కూడా. వారి మాటల్ని పట్టించుకుంటే, మానసిక ప్రశాంతతను కోల్పోతామని కీర్తి ఎన్నోసార్లు చెప్పింది..’ అంటూ రేవతి చెప్పుకొచ్చారు.
కీర్తి సురేష్ (Keerthy Suresh) కూడా తన బబ్లీ లుక్ మార్చి, స్లిమ్‌గా మారిపోయిన విషయం విదితమే. ఈ బరువు సమస్య చాలామందిలో వుంటుంది. నటి నమిత కూడా ఈ అధిక బరువు బాధితురాలే. తగినంత శారీరక శ్రమ ఎప్పుడూ వుండలా చూసుుంటే, తినే ఆహారం పట్ల సరైన అవగాహన వుంటే, అధిక బరువు సమస్య నుంచి గట్టెక్కవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
పలు రకాల వైద్య చికిత్సలు అధిక బరువు (Obesity & Health Problems) సమస్యకు పరిష్కారంగా అందుబాటులోనే వున్నా, వాటికంటే మెరుగ్గా సంప్రదాయ మార్గాలైన డైట్ కంట్రోల్ సహా యోగా వంటివి చేస్తే సులువుగానూ ఆరోగ్యవంతంగానూ శరీర బరువుని తగ్గించుకోవచ్చు.