బిర్యానీ (Royal Gold Biryani The Most Expensive Biryani) అంటే పాతిక రూపాయల నుంచి దొరికేస్తోంది. 25 రూపాయలంటే మరీ నాసిరకం బిర్యానీ అనుకోవడానికి వీల్లేదు.. కొన్ని చోట్ల ఇది నిజంగానే చాలా బావుంటుంది. ఓ మంచి బిర్యానీ అంటే 150 నుంచి 250 మధ్య దొరుకుతుంటుంది.
కానీ, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ఈ బిర్యానీ (Biriyani) ధర ఏకంగా 20 వేల రూపాయలు. ఔను, నిజ్జంగా నిజమిది. అయితే, ఈ బిర్యానీ తినాలంటే దుబాయ్ వెళ్ళాలి. అక్కడ దొరికే స్పెషల్ బిర్యానీ ధర అక్కడి కరెన్సీలో 1000 దిర్హాములు. అదే ఇక్కడి రూపాయలతో పోల్చితే 20 వేల రూపాయలకు ఓ మూడొందల రూపాయలు తక్కువ అన్నమాట. అంటే సుమారుగా 19,700 రూపాయలు వుంటుంది.
ఇంతకీ, ఈ బిర్యానీలో అంత ‘ధర’ (Royal Gold Biryani The Most Expensive Biryani) పలికేంత ప్రత్యేకతలు ఏమున్నాయి.? అనే సందేహం మీకు కలగడం సహజమే. వున్నాయ్, చాలా ప్రత్యేకతలే వున్నాయి. దీని పేరు రాయల్ గోల్డ్ బిర్యానీ. దీన్ని తినడానికి ఉపయోగించే బంగారంతో గార్నిష్ చేసి వడ్డిస్తారు. అందుకే, దీనికి ఆ ‘గోల్డెన్ నేమ్’ వచ్చింది.

ఖరీదైన బిర్యానీ రైస్, కీమా రైస్ వీటితోపాటు కుంకుమ పువ్వు వినియోగించి చేసే రైస్, తెల్లటి రైస్.. అన్నీ కలిసి వుంటాయి ఈ బిర్యానీలో. జీడిపప్పు మామూలే. చిన్న చిన్న బంగాళా దుంపలు, వాటికి తోడుగా ఉడకబెట్టిన గుడ్లు.. మన దగ్గర కూడా కొన్ని బిర్యానీల్లో లభ్యమవుతాయనుకోండి.. అయినా, ఇక్కడ ఈ గోల్డెన్ బిర్యానీలో అవి కూడా కాస్త స్పెషల్ ఫ్లేవర్‌తో వుంటాయట.
కాశ్మీరీ కబాబ్స్, ఓల్డ్ ఢిల్లీ కబాబ్స్, రాజ్‌పుట్ చికెన్ కబాబ్స్, మొగలాయ్ కోఫ్తా.. ఇలా చాలా వెరైటీలు ‘రాయల్ గోల్డ్ బిర్యానీ’ ప్రత్యేకతల్లో కొన్ని. బిర్యానీకి అదనంగా నిహారీ సలాన్, జోద్‌పురి సలాన్, బదామీ సాస్, రైతా వంటివి కూడా వడ్డిస్తారు.
ఇంతటి ప్రత్యేకమైన బిర్యానీ (Royal Gold Biryani The Most Expensive Biryani) కాబట్టే, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బిర్యానీగా ‘రాయల్ గోల్డ్ బిర్యానీ’ పేరుగాంచిందన్నది నిర్వాహకుల అభిప్రాయంగా వుంది.
ఈ బిర్యానీని అందించే రెస్టారెంట్ కూడా మన భారతీయులు నిర్వహిస్తున్నదే కావడం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం. ఓసోస్, మరికొన్ని ప్రత్యేకతలు అద్ది ఓ యాభై వేలకో, లక్ష రూపాయలకో బిర్యానీ తయారు చేసి దాన్నొక రికార్డుగా ముందు ముందు చూపించేస్తారేమో.. అనిపిస్తోందా.? అయితే, అది మీ తప్పు కాదు.
తినేవాడు ఖర్చుకు వెనుకాడకపోతే.. ప్రత్యేకతల కోసం ఎంతైనా ఖర్చు చేసేవాళ్ళుంటే.. బిర్యానీ (Royal Gold Biryani The Most Expensive Biryani) 50 వేలు, లక్ష ఏం ఖర్మ.. కోటి రూపాయలైనా వుంటుంది. కాదంటారా.?