Table of Contents
తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ తిరుగులేని గుర్తింపు తెచ్చకుంది హీరోయిన్ నయనతార. తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ఎక్కువ పారితోషికం (రెమ్యునరేషన్) తీసుకుంటున్న నయనతార (Nayanthara and Vignesh Shivan To Tie Knot), అక్కడ ‘లేడీ సూపర్ స్టార్’ అనే గుర్తింపు సంపాదించుకుంది.
వ్యక్తిగత జీవితం విషయానికొస్తే, నయనతార గతంలో తమిళ నటుడు శింబుతో ప్రేమలో పడింది. ఆ తర్వాత ఇద్దరి మధ్యా విభేదాలొచ్చి విడిపోయారు. ఆ తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవాతో కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపింది నయనతార. ఆ ప్రేమ కూడా పెళ్ళి పీటలదాకా వెళ్ళలేకపోయింది.
Also Read: Pooja Hegde Bags Hottest Chance Ever!
ఇక, గత కొన్నాళ్ళుగా తమిళ దర్శకుడు విఘ్నేష్ – నయనతార (Nayanthara Vignesh Shivan Romantic) మధ్య ప్రేమాయణం నడుస్తోంది. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. అడపా దడపా తమ మధ్య సన్నిహిత సంబంధాన్ని బయటపెడుతూ నయనతార, విఘ్నేష్ సోషల్ మీడియాలో ఫొటోల్ని షేర్ చేస్తుంటారు.

ఇంతకీ, ఈ ఇద్దరి పెళ్ళెప్పుడు.? అంటే, ఆ ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడంలేదు. ‘నాకు చాలా చాలా స్పెషల్ పర్సన్’ అనే మాట ఇరువురి నుంచీ వస్తుంటుంది. ప్రేమ, పెళ్ళి ప్రస్తావన మీడియా తీసుకొస్తే, ఇద్దరూ టాపిక్ డైవర్ట్ చేసేస్తుంటారు.
Also Read: సింగర్ సునీత టైమింగ్.. ట్రోల్స్‌పై రియాక్షన్ సూపర్ స్ట్రాంగ్.!
గత ఏడాది కరోనా పాండమిక్ సమయంలో ఇద్దరికీ పెళ్ళి.. అనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత అదంతా ఉత్తదేనని తేలిపోయింది. తాజాగా, ఇంకోసారి అలాంటి పుకార్లే షికార్లు చేశాయి. కానీ, ఇంకోసారి కూడా అవన్నీ పుకార్లని తేలిపోయింది.
Also Read: Reel Or Real: Queen Kangana Ranaut As Thalavi
ఇంతకీ, తరచూ మీడియాని ర్యాగింగ్ చేసేందుకోసమే.. నయనతార – విఘ్నేష్.. ఆసక్తికరమైన ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడం వెనుక ఆంతర్యమేంటి. ఏమోగానీ, నయనతార – విఘ్నేష్ (Nayanthara and Vignesh Shivan To Tie Knot) రొమాంటిక్ ఫొటోలకి సోషల్ మీడియాలో లభించే కిక్కే వేరప్పా.