యంగ్ టైగర్ ఎన్టీయార్, సూపర్ హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ (NTR 30 Koratala Siva To Direct Young Tiger)మరోమారు ఖరారైంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి ‘జనతా గ్యారేజ్’ సినిమా చేసిన విషయం విదితమే. ‘అప్పుడు లోకల్.. ఈసారి బౌండరీస్ దాటేస్తున్నాం..’ అంటూ కొరటాల శివ తనదైన స్టయిల్లో కొత్త ప్రాజెక్ట్ గురించి ప్రకటించాడు.
నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రానికి సమర్పకుడు. యువసుధ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్నారు. నిజానికి, ఎన్టీఆర్ 30 (యంగ్ టైగర్ ఎన్టీఆర్ Young Tiger NTR 30వ సినిమా), హారిక హాసిని పతాకంపై త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కాల్సి వుంది. కొన్ని కారణాలతో ఆ సినిమా వెనక్కి వెళ్ళినట్లు తెలుస్తోంది.
మరోపక్క, యువసుధ బ్యానర్ అల్లు అర్జున్ (Icon Staar Allu Arjun) హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఎఎ21 సినిమా (అల్లు అర్జున్ 21వ సినిమా) నిర్మించాల్సి వుంది. కొన్ని కాంబినేషన్లు అంతే.. ఒక్కోసారి ఒక్కోలా మారిపోతుంటాయంతే.
ఇక, యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ చేయనున్న కొత్త సినిమా, 2022 ఏప్రిల్ 29న విడుదల కాబోతోందట. ఈ విషయాన్ని సినిమా ప్రకటనతోనే వెల్లడించేశారు చిత్ర దర్శక నిర్మాతలు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే పూర్తయిపోయిన సినిమాలు వాయిదా పడుతున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో ఇంకా పట్టాలెక్కాల్సిన సినిమా రిలీజ్ డేట్ (NTR 30 Koratala Siva To Direct Young Tiger) ప్రకటించేయడం కాస్తంత ఆశ్చర్యకరమే.
ప్రస్తుతం కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ (Koratala Siva Mega Star Chiranjeevi Acharya) సినిమా తెరకెక్కిస్తోంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.