ప్రజలు పన్నులు కడితేనే ఖజానా నిండుతుంది. పాలకులు అప్పులు చేసేది ప్రజల్ని ఉద్ధరించడానికే. కానీ, ఆ అప్పులు తీర్చాల్సింది ప్రజలే. ఏ ప్రభుత్వం (Democracy In India Dirty Vote Bank Politics) అధికారంలో వున్నా ఇదే జరిగేది. ఓట్లు అందరూ వేస్తారు.. కానీ, సంక్షేమ పథకాల పేరుతో తాయిలాలు కొందరికే అందుతాయి. ఇదీ మన ఘన ప్రజాస్వామ్యం.
సంక్షేమ పథకాల్ని ప్రభుత్వాలు కొందరికే ఎందుకు ఇస్తాయి.? అన్నది వేరే చర్చ. దశాబ్దాలుగా దేశంలో పేదరిక సమస్య సమసిపోలేదు. ఏ యేడాదికి ఆ యేడాది సరికొత్తగా పేదలు పుట్టుకొస్తున్నారు. లబ్దిదారుల సంఖ్య పెరుగుతోందంటే, దానర్థమేంటి.? పేదలు పెరుగుతున్నారనే కదా.?
Also Read: విద్యావ్యవస్థకి డబ్బు జబ్బు.. నేరమెవరిది.? శిక్ష ఎవరికి.?
మరి, సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్ని ప్రభుత్వాలు ఉద్ధరిస్తున్నాయా.? లేదంటే, ప్రజల్ని సోమరిపోతుల్లా ప్రభుత్వాల సంక్షేమ పథకాలు మారుస్తున్నాయా.? సంక్షేమం అంటేనే ఓటు బ్యాంకు రాజకీయమిప్పుడు. ఒకప్పటి సంక్షేమ ఆలోచనలకి, ఇప్పటి సంక్షేమ ఓటు బ్యాంకు రాజకీయాలకీ చాలా తేడా.
అధికారంలో ఎవరున్నాసరే, వారి పేరుతో ‘కానుకలు’ ప్రజలకు ఇస్తున్నారు.. సంక్షేమం ముసుగులో. సొమ్మెవడిది.? సోకులెవడివి.? అని ప్రజలు ఆలోచించడం మొదలు పెడితే, ఏ నాయకుడి పేరుతోనూ దేశంలో సంక్షేమ పథకాలు అమలయ్యే పరిస్థితే వుండదు. అందుకే, కులం పేరుతో.. మతం పేరుతో.. ప్రాంతం పేరుతో రాజకీయ పార్టీలు, రాజకీయాలు చేస్తుంటాయ్.
Also Read: Diabetes.. వ్యాక్సిన్ ఎందుకు రాలేదు చెప్మా.?
ప్రజలు, ప్రభుత్వాలకి పన్నులు చెల్లిస్తే.. అలా వచ్చే సొమ్ముని.. సంక్షేమం పేరుతో ప్రజలకి పంచిపెడుతూ, వాటికి కానుకలంటూ కొత్త పేర్లు అతికించి, ప్రజల్ని బానిసల్లా, బిచ్చగాళ్ళలా మార్చేస్తున్న రాజకీయాన్ని ఏమనాలి.? అసలు దీన్ని ప్రజాస్వామ్యం అనగలమా.? అన్నదీ ఆలోచించుకోవాల్సి విషయమే.
ఎవరు అధికారంలో వున్నా, జరిగేది ఇదే. రాజులు పోయాయ్.. రాజ్యాలూ పోయాయ్.. అనుకుంటాంగానీ, ఇప్పుడు మనం వున్నది ప్రజాస్వామ్యంలో కానే కాదు.. ఒకప్పటి రాచరిక వ్యవస్థ కంటే దారుణమైన పరిస్థితుల్లో (Democracy In India Dirty Vote Bank Politics) వున్నాం.