ఆమె రోడ్డు ప్రమాదానికి గురైంది. నటి కావడంతో, ఈ విషయం వైరల్ అయ్యింది. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నదన్నదానిపై అభిమానులు ఆందోళన చెందడం సహజం. కానీ, ఇక్కడ ఓ పైశాచిక ఆనందం కూడా కనిపిస్తోంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆ నటి పేరు యాషికా ఆనంద్ (Yashika Aannand Met With Accident).
రౌడీ హీరో విజయ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన ‘నోటా’ (NOTA) సినిమాలో యాషికా ఆనంద్ ఓ కీలక పాత్రలో కనిపించింది. బిగ్బాస్ రియాల్టీ షో (తమిళం) ఆమెకు బోలెడంత పాపులారిటీ తెచ్చిపెట్టింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్లతో ఆమె సందడి చేస్తుంటుంది.
Also Read: ‘ప్లస్ సైజ్’.. అది నా తప్పు కాదు.!
దాదాపు 25 లక్షల మంది ఫాలోవర్లు యాషికా ఆనంద్కి (Yashika Anand) సోషల్ మీడియాలో ఉన్నారు. వీళ్లలో అభిమానులు, దురభిమానులు కూడా ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డ యాషిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించేవారు, ఆమె కోసం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు చేస్తుంటారు. దురభిమానుల దారి వేరు.
రోడ్డు ప్రమాదంలో యాషికకు ఏమీ జరిగి ఉండదు.. ఎందుకంటే, ఆమెకి నేచురల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయంటూ ఆమె ఎద భాగంపై జుగుప్సాకరమైన కామెంట్లు చేస్తున్నారు. నిజానికి యాషిక (Yashika) పెద్దగా ఏ వివాదంలోనూ తల దూర్చదు. కానీ, ఆమెపై ఇంతలా స్లట్ షేమింగ్ చేయడానికి కారణం బహుశా ఆమె సోషల్ మీడియాలో చేసిన అందాల ప్రదర్శనే కావచ్చుననే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
Also Read: చింపేస్తాం.. పోగులే ధరిస్తాం.. అంతా మా ఇష్టం.!
అయినా సరే, ఇంత జుగుప్సాకరమా.? ప్రాణాలతో పోరాడుతున్న వ్యక్తి గురించి ఇంతటి దారుణ కామెంట్స్ ఎలా చేయగలుగుతున్నారు.? అదంతే. సోషల్ మీడియాని పైశాచిక ఆనందం కోసం ఓ చక్కని వేదికగా మార్చుకునే వారికి నైతిక విలువలూ, మానవత్వం గురించి కనీస అవగాహన ఉంటుందని ఎలా అనుకోగలం.?
Also Read: మాల్దీవుల్లో అందాల మంట పెట్టేస్తున్నారహో
రోడ్డు ప్రమాదంలో యాషికకు (Yashika Aannand Met With Accident) తీవ్ర గాయాలు కాగా, ఆమె స్నేహితురాలు మృతి చెందింది.