యంగ్ టైగర్ ఎన్టీయార్, కింగ్ అక్కినేని నాగార్జున.. ఈ ఇద్దరూ బుల్లితెరపై పోటీ పడబోతున్నారు (Jr NTR Vs Nagarjuna Evaru Meelo Koteeswarulu Bigg Boss Telugu 5). ఔను, ఒకరు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అంటున్నారు. ఇంకొకరేమో, ‘బిగ్ బాస్’ తానేనంటున్నారు. నిజానికి, ఒకప్పుడు ఈ రెండూ ఒకే ఛానల్‌లో ప్రసారమైన రియాల్టీ షోలు. కొత్త సీజన్స్ వచ్చేసరికి సీన్ మారింది.
కింగ్ అక్కినేని నాగార్జున గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ రియాల్టీ గేమ్ షోకి హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దానికే, ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీయార్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. అయితే, పేరు మారింది.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అంటూ. ఛానల్ కూడా మారిందిప్పుడు.
ఇక, యంగ్ టైగర్ ఎన్టీయార్ గతంలో హోస్ట్‌గా వ్యవహరించిన ‘బిగ్ బాస్’ రియాల్టీ షోకి, కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్టీయార్ హోస్ట్‌గా సాగితే, రెండో సీజన్.. నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా సాగింది. ఆ తర్వాతి నుంచి.. అంటే, మూడో సీజన్ అలాగే నాలుగో సీజన్‌కి కూడా నాగార్జునే హోస్ట్. ఇప్పుడు ఐదో సీజన్ కూడా నాగ్ హోస్ట్‌గానే జరగనుంది.
‘ఎవరు మీలో కోటీశ్వరులు’కి డేట్ వచ్చేసింది. ఆగస్ట్ 22 నుంచి ఇది బుల్లితెర వీక్షకుల్ని అలరించనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో కలిసి దర్శనమివ్వనున్నాడు. బిగ్ బాస్ తెలుగు 5 ప్రారంభమయ్యేది ఎప్పుడు.? అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి వుంది.
అన్నట్టు, ఓ వంటల రియాల్టీ షో ద్వారా హోస్ట్ అవతారమెత్తుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇది కూడా రెండు బ్యాక్ టు బ్యాక్ రెండు రోజులు వారంలో వుంటుంది. ఇది కూడా బిగ్ బాస్ రియాల్టీ షోకి పోటీనే. తమన్నా, ఎన్టీయార్ ఓ ఛానల్ ద్వారా ప్రేక్షకుల్ని అలరించనుండగా, నాగార్జున ఇంకో ఛానల్ ద్వారా కేవలం వీకెండ్స్‌లో మాత్రమే (Jr NTR Vs Nagarjuna Evaru Meelo Koteeswarulu Bigg Boss Telugu 5) కనిపిస్తాడు.
మొత్తమ్మీద, బుల్లితెరపై బీభత్సమైన యుద్ధం జరగబోతోందన్నమాట. ఇది టీఆర్పీ యుద్ధం. కరోనా నేపథ్యంలో నెలకొన్న స్తబ్దత అంతా పోయి.. బుల్లితెర హోరెత్తిపోతే అంతకన్నా కావాల్సిందేముంది.? అబిమాన తారలు బుల్లి తెర ద్వారా నేరుగా మనింట్లోకే వచ్చేస్తోంటే.. ఆ కిక్కే వేరప్పా.
సోమవారం నుంచి గురువారం వరకూ ఎన్టీయార్, శుక్ర అలాగే శనివారాల్లో తమన్నా.. శని, ఆదివారాల్లో కింగ్ అక్కినేని నాగార్జున.. అంతేనా, వారమంతా బిగ్ బాస్ హౌస్ మేట్స్ హంగామా.. వెరసి, బోల్డంత ఎంటర్‌టైన్‌మెంట్.