Table of Contents
Bigg Boss Telugu 5 బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఐదో సీజన్ మొదలైంది. కింగ్ అక్కినేని నాగార్జున ముచ్చటగా మూడోస్సారి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెల్సిందే. నాగ్ హోస్ట్‌గా వ్యవహరించిన మూడు, నాలుగు సీజన్లతో పోల్చితే, ఐదో సీజన్.. బీభత్సమైన ఎనర్జీతో మొదలైందనే చెప్పాలి.
106 రోజుల పాటు సాగే ఈ రియాల్టీ షో కోసం మొత్తం 19 మంది కంటెస్టెంట్లు.. బిగ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒకరిద్దర్ని మినహాయిస్తే, మిగతా అందరి ఎంట్రీలూ అదిరిపోయాయ్. ‘అంతకు మించి..’ అనే స్థాయిలోనే పెర్ఫామెన్సెస్ కనిపించాయి.
Bigg Boss Telugu 5 కంటెస్టెంట్స్ కెవ్వు కేక..
ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. చాలామంది కంటెస్టెంట్స్ చాలామందికి తెలిసినవాళ్ళే. ఒకరిద్దరు మాత్రం పెద్దగా ఎవరికీ పరిచయం లేనోళ్ళు. అయితేనేం, ఎనర్జీ పరంగా ఎవరూ తక్కువ కాదు. ఇదిలా వుంటే, కంటెస్టెంట్స్ వీళ్ళేనంటూ చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. అవి దాదాపుగా నిజమయ్యాయి.
ఇంతకీ, టాప్ ఫైవ్‌లో ఎవరుంటారు.? ఈ ప్రశ్న కూడా ఆల్రెడీ ముందే వినిపించింది. దానికీ రకరకాల సమాధానాలు సోషల్ మీడియాలో ఊహాగానాల రూపంలో వినిపించాయి. అధికారికంగా కంటెస్టెంట్ల పేర్లు ఖరారయ్యాక.. వాళ్ళంతా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాక.. వారి వాలకం, వారికున్న ఫాలోయింగ్ ప్రకారం.. ఇదిగో టాప్ ఫైవ్.. అంటూ కొన్ని అభిప్రాయాలు కొందరు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి.
అప్పుడే టాప్ 5 గురించిన రచ్చ షురూ..
తాజా అంచనాల ప్రకారం చూస్తే షన్ముఖ్ జస్వంత్ అలియాస్ షన్నూ టాప్ ప్లేస్ దక్కించుకునేలా వున్నాడు. యాంకర్ రవి, విశ్వా, సింగర్ శ్రీరామచంద్ర.. పేర్లు ఆ తర్వాత వినిపిస్తున్నాయి. ఈసారి మహిళా విజేత అయితే బావుంటుందనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఆర్జే కాజల్ చాలా ఎనర్జిటిక్‌గా వుంది. శ్వేతా వర్మ అయితే పవర్ హౌస్. ట్రాన్స్‌జెండర్ ప్రియాంక కూడా అంతే. సిరి, లహరి షరి, సరయు.. ఇలా పలువురు సత్తా చాటేలానే వున్నారు.
వీజే సన్నీ బాగా సందడి చేసేస్తున్నాడు.. హౌస్‌లోకి వచ్చినప్పటినుంచీ. అయితే, ‘అతి’ అన్న ముద్ర వేయించేసుకుంటున్నాడు. కొరియోగ్రాఫర్ నటరాజ్ పక్కా గేమ్ప్లాన్తోనే వచ్చినట్టున్నాడు. ఓవరాల్‌గా చూస్తే, ఈసారి 19 మందిలో.. చివరి ఐదుగురు ఎవరుంటారు.? అనేది కూడా తేల్చడం కష్టంగానే కనిపిస్తోంది.
అయితే, నటి ఉమా దేవి వికెట్ తొలుత పడిపోవచ్చు. మరో నటి ప్రియ కూడా వేగంగానే హౌస్ నుంచి బయటకు వచ్చేందుకు అవకాశాలున్నాయి. యాంకర్ రవి, టాప్ ఫైవ్‌లో వుంటాడా.? లేదంటే, ‘కాంట్రాక్ట్’ బేసిస్ మీద.. కొన్ని వారాల పాటు మాత్రమే హౌస్‌లో వుంటాడా.? అన్నదానిపై భిన్నవాదనలున్నాయి.
అదంతే.. బిగ్ బాస్ కథంతే..
బిగ్ బాస్ రియాల్టీ షో కోసం.. ఆ షో అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారనడానికి ఈ అంచనాలే నిదర్శనం. ఎవరి గోల వారిది. బిగ్ హౌస్‌లో ఏదైనా ఎప్పుడైనా ఎలాగైనా జరగొచ్చు. విన్నర్ అవ్వాల్సినోడు.. అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యందుకు ఆస్కారముంది. బలహీనమైన కంటెస్టెంట్ అనుకున్న వ్యక్తి.. విన్నర్ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అలాగని స్పెక్యులేషన్స్ ఆగుతాయా.? అయినాగానీ, షో మొదలైన రోజే స్పెక్యులేషన్స్ బయటకు రావడమంటే.. దటీజ్ బిగ్ బాస్.