Kumki Elephant Pawan Kalyan.. ఆసియా ఏనుగులు తెలుసు.. ఆఫ్రికా ఏనుగులు తెలుసు.. ఈ కుంకీ ఏనుగులు ఏంటి.? వీటి గురించి ఎందుకు చర్చ జరుగుతోంది.?
కుంకీ ఏనుగులు ఏం చేస్తాయి.? వీటి వల్ల ప్రయోజనాలేంటి.? సాధారణ ఏనుగులతో పోల్చితే, ఈ కుంకీ ఏనుగులకు వున్న ప్రత్యేకతలు ఏమిటి.?
అడవిలో కొన్ని ఏనుగులు చాలా ప్రమాదకరంగా వ్యవహరిస్తుంటాయి. అదే, దేవాలయాల్లో కనిపించే ఏనుగులు చాలా ప్రశాంతంగా వుంటాయి.
Kumki Elephant Pawan Kalyan.. అవీ ఏనుగులే.. ఇవీ ఏనుగులే..
నిజానికి, కుంకీ ఏనుగులంటే, ఆఫ్రికా ఏనుగులేమీ కావు. అవి కూడా ఆసియా ఖండానికి చెందిన ఏనుగులే. పైగా, మన దేశంలో లభించే ఏనుగులే.!
కానీ, ఇవి శిక్షణ పొందిన ఏనుగులు. దేవాలయాల్లో వినియోగించే గజరాజులకు ఎలాగైతే శిక్షణ ఇస్తారో, దాదాపు అలాంటి శిక్షణే కుంకీ ఏనుగులకు కూడా ఇస్తారు.
సాధారణంగా, కుంకీ ఏనుగులు సాధారణ ఏనుగులతో పోల్చితే కాస్త పెద్దవిగా వుంటాయి పరిమాణంలో. పెద్ద ఏనుగుల వల్ల అదనపు ప్రయోజనాలుంటాయి.

చురుగ్గా వుండే ఏనుగులకు శిక్షణ ఇచ్చి, కుంకీ ఏనుగులుగా తయారు చేస్తారు. వీటిని, రెస్క్యూ కోసం అలాగే, ఇతరత్రా అవసరాల నిమితం వినియోగిస్తుంటారు.
రెస్క్యూ.. అంటే, అడవిలో ప్రమాదవశాత్తూ ఏదైనా ఏనుగు గాయపడితే, అది ఆ సమయంలో చాలా బాధతో, కోపంతో వుంటుంది. దాన్ని శాంతపరిచి, దానికి సాయం అందించేందుకు కుంకీ ఏనుగు ఉపయోగపడుతుంది.
ఇంకొన్ని సందర్భాల్లో గుంపులుగా ఏనుగులు, పంట పొలాల మీద, ఊళ్ళ మీద పడి విధ్వంసం సృష్టిస్తుంటాయి.. వాటిని అదుపు చేసేందుకు కూడా కుంకీ ఏనుగులను ఉపయోగిస్తారు.
కుంకీ.. అర్థం ఇదీ..
‘కుంకీ’ అన్న పదం ‘కుమక్’ అనే పర్షియన్ పదం నుంచి వచ్చిందిట. పర్షియన్‌లో ‘కుమక్’ అంటే, ‘సాయం’ అని అర్థమట.
అంతేగానీ, కర్నాటక ఏనుగుల్ని, ఆంధ్ర ప్రదేశ్ ఏనుగులపై దాడి కోసం రప్పిస్తున్నారంటూ వైసీపీ అను‘కుల’ మీడియా ఆరోపిస్తున్నట్లు, ‘కుంకీ’ అంటే, శతృవు కాదు.. కుంకీ అంటే సాయం.!
Also Read: యుద్ధమంటే ఒక్కటయ్యాం! ఇంతలోనే ముక్కలైపోతామా.?
అటు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ.. ఇటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ ఏనుగుల కారణంగా విపరీతమైన పంట నష్టం వాటిల్లుతోంది.. మనుషుల ప్రాణాలూ పోతున్నాయి.
ఈ నేపథ్యంలో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్నాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, రాష్ట్రానికి ఎనిమిది కుంకీ ఏనుగుల్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు.
వాటిల్లో కొన్ని ‘కుంకీ’ ఏనుగులు తాజాగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చేరాయి. ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు, దేశంలోని పలు రాష్ట్రాలు ఈ కుంకీ ఏనుగుల్ని వినియోగిస్తున్నాయి.