Dirty Politics Vulgar Politicians ఉద్యోగం కోసం వెళ్ళే వారి మీద ఎలాంటి పోలీస్ కేసులూ వుండకూడదు. కానీ, రాజకీయాల్లో ఎన్ని ఎక్కువ కేసులు వుంటే, అంత పాపులర్. ఇదీ నేటి రాజకీయం. ఇకపై రాజకీయాల్లో కనీస అర్హత అంటే, ఎన్నో కొన్ని కేసులు వుండి తీరాలన్నమాట. దాంతోపాటుగా, వీలైనన్ని ఎక్కువ బూతులు నిస్సిగ్గుగా మాట్లాడాల్సిందేనని రాజకీయ పార్టీలు షరతులు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
రాజకీయం ఎంత దిగజారిపోయిందో చెప్పడానికి ఉదాహరణలు కోకొల్లలు. ఇంతకంటే దిగజారడానికి ఇంకేముంటుంది.? అని జనం ముక్కున వేలేసుకుంటున్న ప్రతిసారీ, ప్రజల అంచనాల్ని తల్లకిందులు చేసి, ‘అంతకు మించిన’ నిస్సిగ్గు రాజకీయం చేస్తుంటారు రాజకీయ నాయకులు.
Also Read: రుధిర జర్నలిజం: బైక్ స్పీడు గంటకి 400 కిలోమీటర్లు.!
ఛోటా మోటా నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. అందరిదీ ఒకటే దారి.. అదే బూతుల దారి. ఓ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ చెబుతాడు. ‘శ్రీనుగారూ.. మీ నాన్నగారు బాగున్నారా.? అని అడగడానికీ.. నీ యమ్మ మొగుడు బాగున్నాడా.? అనడానికీ చాలా తేడా వుంది..’ అన్నదే ఆ డైలాగ్. ఆ తర్వాత ఓ బూతు పదం బాలయ్య ప్రయోగిస్తాడనుకోండి.. దాన్నిక్కడ మనం ప్రస్తావించలేం.
సినిమాలు వేరు.. వాటికి సెన్సార్ వుంటుంది. రాజకీయాలకు సెన్సార్ వుండదు. ‘మేం రాజకీయ నాయకుల బూతులకు సెన్సార్ వేస్తాం.. బీప్ వేస్తున్నాం..’ అని నిస్సిగ్గుగా న్యూస్ ఛానళ్ళు చెప్పుకుంటాయి తప్ప, అలాంటివారి వద్దకు వెళ్ళే సమయంలో లైవ్ కవరేజ్ ఆలోచనల్ని మాత్రం విరమించుకోవు. పైగా, అలా బూతులు మాట్లాడేవారికి అదనపు ప్రమోషన్స్ మీడియా పరంగా కల్పిస్తుంటారు.
Also Read: ఆన్లైన్ బూతు బాగోతం.. ఈ రోగానికి వ్యాక్సిన్ ఏదీ.?
ఓ పార్టీకి చెందిన నాయకుడు ఇటీవల ‘నా కొడుకులు..’ అంటూ ముఖ్యమంత్రి సహా మంత్రులపైనా, అధికారులపైనా విరుచుకుపడిపోయారు. దీనిపై పెద్ద రాద్ధాంతమే జరిగింది. ‘చర్చిల్లో పాస్టర్లు ఓ మై సన్..’ అంటారనీ, దాన్నే తెలుగులో తాను చెప్పానంటూ సదరు నాయకుడు కవరింగ్ ఇచ్చుకున్నాడు.
ఇంకోపక్క, ఓ మంత్రిగారు, ‘నీ యమ్మ మొగుడు..’ అంటూ ప్రతిపక్ష నేత మీద పదే పదే విరుచుకుపడుతుంటాడు. ‘నీ యమ్మ మొగుడు.. అంటే, మీ నాన్న..’ అని ఆ నాయకుడు తాను చేసిన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నాడు. బహుశా, ఆయనకి అలా పిలిపించుకోవడమే ఇష్టమేమో.. సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా అలాగే మాట్లాడుకుంటారేమో.!
Also Read: కొత్త పైత్యం.. స్కూళ్ళలో శృంగార విద్యాభ్యాసం.?
ఎవరికైనా పిచ్చి ముదిరితే, పిచ్చాసుపత్రికి పంపిస్తాం. మరి, రాజకీయాల్లో వున్న ఇలాంటి బూతు వీరుల్ని ఎక్కడికి పంపించాలి.? వాళ్ళని ఎలా శిక్షించాలి.? నేరమయ రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. చట్టాల్ని చేస్తున్నవారే నేరారోపణలు ఎదుర్కొంటున్న దరిమిలా.. మన రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుందని ఆశించలేం.
భవిష్యత్తులో బూతుల ప్రవాహాన్ని రాజ భాషగా ఆమోదించేసినా (Dirty Politics Vulgar Politicians) ఆశ్చర్యపోనక్కర్లేదేమో.. మన గొప్ప ప్రజాస్వామ్యంలో.