కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ నటి దీపికా పడుకొనె మీద ట్రోలింగ్ నడిచింది. ఆమె ఎద భాగంపై కొందరు అసభ్యకరమైన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా చేస్తే, ‘అవును.. నేను మహిళను. నాకు వక్షోజాలున్నాయి..’ అని చెప్పుకోవాల్సి వచ్చింది దీపిక. అసలు ఇలాంటి వివాదాలు ఎందుకొస్తాయ్.? ఎందుకంటే, ఇది సోషల్ మీడియా పైత్యపు యుగం (Rashmika Mandanna Controversy) కనుక.
హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా ఓ నెటిజన్ తన ప్రయివేట్ పార్ట్స్ విషయమై ఘాటైన సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే. మరో సందర్భంలో ఓ నటి మరో నటి తాలూకు హెడ్ లైట్స్, బంపర్ గురించి చెత్త వాగుడు వాగింది. అది అప్పట్లో వివాదాస్పదమయ్యింది.
ఈ పైత్యం.. వేరే లెవల్.!
ఓ తెలుగు సినిమాలో హీరో, హీరోయిన్లు మాట్లాడుకుంటుండగా, హీరోయిన్ ఇన్నర్ వేర్ బయటికి కనబడే సన్నివేశంలో దాన్ని హీరో గమనిస్తే, అది చూసి హీరోయిన్ సిగ్గుపడుతుంది. ఇంకో సినిమాలో హీరో ఒంటి మీద టవల్ లాగేసిన హీరోయిన్.. అదో రకమైన ఎక్స్ప్రెషన్ పెడుతుంది. సినిమాలో నటన వేరు. దానికి వక్ర భాష్యం చెప్పడం అన్ని సందర్భాల్లోనూ తగదు.

తాజాగా, నటి రష్మికా మండన్నా ఓ ప్రకటనలో నటించింది. బాలీవుడ్ నటుడు విక్కీ కౌషల్ కూడా అందులో ఉన్నాడు. విక్కీ కౌషల్ అండర్ వేర్ చూసి మురిసిపోతుంది రష్మికా మండన్నా. ఇలాంటి ప్రకటనలు తప్పు అని చెప్పలేం. ఎందుకంటే, హీరోలూ లేదా హీరోయిన్లు పలు సందర్భాల్లో ఇన్నర్ వేర్ ప్రకటనల్లో నటించారు. నటిస్తూనే ఉంటారు.
అదే అసలు సమస్య..
సమస్య ఏంటంటే, రష్మికా మండన్నా, విక్కీ కౌషల్ అండర్ వేర్ చూసి, లొట్టలేసుకోవడాన్ని మహిళా సాధికారత అంటారట. స్త్రీ కూడా తన కోరికలను ధైర్యంగా తన చేతల ద్వారా వెల్లడించగలదని ఆ ప్రకటన ద్వారా క్రియేటర్స్ చెప్పదలచుకున్నారట. వామ్మో.! ఇందులో ఇంత మహిళా సాధికారత ఉందా.?
మహిళా సాధికారత అంటే, మగాడి అండర్ వేర్ చూసి మురిసిపోవడం, పురుషాధిక్యం అంటే, కండోమ్ యాడ్స్‌లో హీరోయిన్ మీద పడి హీరో రెచ్చిపోవడం అనే స్థాయికి ( Rashmika Mandanna Controversy ) ప్రకటనల క్రియేటివిటీ దిగజారిపోయింది.
Also Read: చింపేస్తాం.. పోగులే ధరిస్తాం.. అంతా మా ఇష్టం.!